చివరి ప్రయత్నమా.. నెల్లూరులో టిడిపిపై జగన్ పావులు: హామీ ఇవ్వని లాయర్?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైసిపి, తెలుగుదేశం పార్టీ ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. వైసిపి తరఫున ఆనం విజయ కుమార్, టిడిపి తరఫున వాకాటి నారాయణ రెడ్డి బరిలో ఉన్నారు.

నెల్లూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైసిపి, తెలుగుదేశం పార్టీ ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. వైసిపి తరఫున ఆనం విజయ కుమార్, టిడిపి తరఫున వాకాటి నారాయణ రెడ్డి బరిలో ఉన్నారు.

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అభ్యర్థిపై కోర్టుకు వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. వ్యాపార లావాదేవీల్లో వాకాటి నారాయణ రెడ్డి బ్యాంకులను బురిడీ కొట్టించారనే ఆరోపణతో వైసిపి నేతలు హైకోర్టులో పిటిషన వేయనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఓటమి భయంతో చివరి ప్రయత్నమా

ఓటమి భయంతో చివరి ప్రయత్నమా

ఈ కారణంగా నారాయణ రెడ్డిని అనర్హుడుగా ప్రకటించాలని వారు కోర్టును కోరనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా తమకు అనుకూలంగా ఉన్నందున కేవలం ఓటమి భయంతోనే వైసిపి చివరి ప్రయత్నం చేస్తోందని, నిజానికి ఈ బ్యాంకుల వివాదం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎనసీఎల్‌టీ) పరిధిలో ఉండగా దీనిని విపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. మరో రెండు రోజుల్లో హైకోర్టులో పిటిషన వేసేందుకు వైసీపీ నేతలు ప్రముఖ లాయర్‌తో చర్చించారని కూడా ప్రచారం సాగుతోంది.

ఒడిదుడుకులు ఎదురైనా..

ఒడిదుడుకులు ఎదురైనా..

టీడీపీ అభ్యర్థి వాకాటి వీఎన్ఆర్ ఇన్‌ఫ్రా తదితర సంస్థల చైర్మనగా 1987 నుంచి కొనసాగుతున్నారు. అప్పట్లో కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పలు ఇన్ ఫ్రా సంస్థలు నష్టాల బాట పట్టాయంటున్నారు. వాకాటి ఒడిదుడుకులు ఎదురైనా తమ సంస్థలను నిర్వహించారంటున్నారు. వీటి నిర్వహణకు తన సంస్థల పూచికత్తు కింద రూ. 443 కోట్లకు తన ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టారు.

నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో..

నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో..

సకాలం లో బ్యాంకులకి ఈ రుణాలు తిరిగి చెల్లించకపోవ డంతో వాకాటి పూచికత్తుగా చూపిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఇటీవల బ్యాంకులు ప్రకటించాయి. దీనిపై వాకాటి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ ట్రైబ్యునల్‌ విచా రణ జరిపి ఉద్యోగులు, సంస్థ అభివృద్ధి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని టేకోవర్‌, రీస్ట్రక్చర్‌ తదితర మార్గాలను నిర్దేశి స్తుంది.

వాకాటికి ఇలా చెక్ చెప్పేందుకు..

వాకాటికి ఇలా చెక్ చెప్పేందుకు..

బ్యాంకులకు చెల్లించాల్సిన ప్రతి పైసా చెల్లిస్తామని వాకాటి చెబుున్నారు. ట్రైబ్యునల్‌ తీర్పు ఏం వస్తుందోనని చూస్తున్నామని అంటున్నారు. జిల్లాలో రాజకీయ సమీకరణలు అనుకూలంగా ఉండడంతో గెలుపు తమదేనని టీడీపీ భావిస్తున్న తరుణంలో వాకాటికి చెక్ చెప్పేందుకు వైసిపి కోర్టు తలుపు తట్టనుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కోర్టు స్వీకరిస్తుందా?

కోర్టు స్వీకరిస్తుందా?

బ్యాంకులను బురిడీ కొట్టించినందున టీడీపీ అభ్యర్థిని అనర్హుడుగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ వేసేందుకు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ న్యాయవాదిని సంప్రదించినట్టు తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే పిటిషన్ వేస్తే దానిపై విచారణ జరుగుతుందా లేదా అన్నది సదరు లాయర్‌ గట్టి హామీ ఇవ్వలేదట. కోర్టు ఈ పిటిషన స్వీకరించి విచారణ చేపడితే తమకు అనుకూలమని వైసీపీ నేతలు ఆలోచన చేస్తున్నారు. మారిన సమీకరణలతో తమ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమైనట్లుగా టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పావులు కదుపుతూ..

పావులు కదుపుతూ..

నెల్లూరులో వైసిపి నేత మేకపాటి సోదరుల హవా నడుస్తోంది. వైసిపి అభ్యర్థి గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టిడిపి కూడా అంతే ధీమాతో ఉంది. గత కొద్ది రోజులుగా టిడిపి వేగం పెంచింది. దీంతో వాకాటికి చెక్ చెప్పేందుకు 'అనర్హత' ఆలోచన చేసిందని అంటున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+