వల్లభనేని వంశీ ప్రచార వాహనంపై జగన్ పార్టీ దాడి

గన్నవరంలో వైయస్ జగన్ రోడ్‌షోకు వెళ్లి తిరిగి వస్తూ తమకు కనిపించిన వంశీ ప్రచార వాహనంపై దాడి చేశారు. వంశీ ఎదుటే కర్రలతో, రాళ్లతో వారు దాడికి పూనుకున్నారు. విజయవాడ బాపులపాడు మండలం కొత్తమల్లిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనపై వంశీ డిఐజికి, కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్ట అధినేత చంద్రబాబునాయుడు బస చేసిన హోటల్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. చంద్రబాబు కలిసేందుకు వచ్చిన నాయకులను పోలీసులు లోనికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లాలోని ద్వారకా జోన్ పరిధిలోని ఓ లాడ్జిలో సోమవారం సాయంత్రం అధికారులు తనిఖీలు నిర్వహించారు. లాడ్జిలో లభించిన ల్యాప్‌టాప్‌లలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఓటర్ల వివరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డబ్బులు పంచేందుకు ఓటర్ల వివరాలు సేకరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసి కలెక్టర్‌కు నివేదిక అందజేసిన అధికారులు ఈవ్యవహారంపై విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications