వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం -21న అధికారిక ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైసీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికిగానూ సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. ఎన్నికల అధికారులు మంగళవారం దానిని ఆమోదించారు. ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా..

ఐపీఎస్ ఏబీవీకి జగన్ సర్కారు మరో షాక్ -సస్పెన్షన్ మరో 6నెలలు పొడగింపు -జగన్ ఢిల్లీలో ఉండగానేఐపీఎస్ ఏబీవీకి జగన్ సర్కారు మరో షాక్ -సస్పెన్షన్ మరో 6నెలలు పొడగింపు -జగన్ ఢిల్లీలో ఉండగానే

మొన్నటివరకు టీడీపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత.. వైసీపీలోకి జంప్ కావడం, గత వారమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ను కలిసి కలిసి, ఆయన చేతుల మీదుగా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీ ఫారం అందుకోవడం తెలిసిందే. తనను ఎమ్మెల్సీ పదవిలో కొనసాగించడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, ఆదిమూలపు, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డిలకు సునీత ధన్యవాదాలు తెలిపారు.

ysrcp candidate Pothula Sunitha Unanimously Elected As ap MLC

ఎమ్మెల్యేల కోటాలోలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈసీ షెడ్యూల్ ప్రకారం.. జనవరి 11న నోటిఫికేషన్ విడుదలకాగా, 18న నామినేషన్ల దాఖలు, 19న(ఇవాళ) నామినేషన్ల పరిశీలన, జనవరి 28న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఆ సీటుకు సునీత ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.

కన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనాకన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనా

టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాన్న పోతుల సునీత.. తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపగా ఆమోదం లభించింది. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన సునీతకు చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కానీ, కొద్దిరోజుల కిందటే ఆమె వైసీపీలో చేరిపోయారు.

English summary
YSRCP candidate Pothula Sunitha Unanimously Elected As MLC to the Andhra Pradesh Legislative Council. Election officials approved her nomination on Monday. However, Sunita was unanimously elected as there was only one nomination for the post. An official announcement will be made on the 21st january.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X