వైసీపీ మేయర్ అభ్యర్ధులుగా.. ఆ స్థానాల పై జగన్ గురి - మారిన వ్యూహం..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు (బుధవారం) ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం రిజర్వేషన్లు ప్రకటించారు. దీంతో.. అటు కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు వ్యవహారం పైన చర్చిస్తున్నాయి. ఇటు మాజీ సీఎం జగన్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్ధుల ఖరారు.. పోటీ వ్యూహాల పైన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ కొత్త వ్యూహాలను ఖరారు చేసారు. ఈ నిర్ణయాలు ఇప్పుడు ఆసక్తిగా మారుతున్నాయి.
స్థానిక ఎన్నికల వేళ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి.. 11 సీట్లకే పరిమితం కావటం.. ఈ 27 నెలల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ ఎన్నికల్లో తమ బలం నిరూపణ ఒక్కటే సమాధానంగా భావిస్తున్నారు. ఇందు కోసం పార్టీ నేతల తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఒన్ టు ఒన్ సమావేశం నిర్వహించి.. వారి కి కీల దిశా నిర్దేశం చేసారు. ఎక్కడా ఏకగ్రీవం అవ్వటానికి వీలు లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావటంతో ముందుగా మేయర్ అభ్యర్ధుల ఎంపిక పైన ఫోకస్ చేసారు. నెల్లూరు పార్టీ మేయర్ అభ్యర్దిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. మిగిలిన మేయర్ అభ్యర్ధుల తో పాటుగా ఎలక్షన్ మేనేజ్ మెంట్ పైన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సమావేశంలో కూటమి మధ్య జరుగుతున్న సీట్ల సర్దుబాటు.. సీటు దక్కని వారి బలం వంటివి పరిగణలోకి తీసుకొని పార్టీ అభ్యర్ధిని ఖరారు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. మహిళలకు 50 శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా స్థానికంగా కార్పోరేటర్లు, కౌన్సిలర్ల అభ్యర్ధుల విషయం పూర్తిగా నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి.. సమిష్టి నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించారు. మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక కావటంతో బలమైన.. ప్రజా మద్దతు ఉన్న అభ్యర్ధిని బరిలోకి దించటం ద్వారా కలిసి వస్తుందని చెబుతున్న జగన్.. ఇందు కోసం ఇప్పటికే సర్వే సంస్థల ద్వారా వర్గాల వారీగా జాబితా సిద్దం చేసారు. ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు కావటం తో మేయర్ అభ్యర్ధులను ఫిక్స్ చేయనున్నారు. కార్పోరేషన్లలో ప్రత్యేకంగా తాము గెలుస్తామని నమ్ముతున్న స్థానాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఈ సాయంత్రం వైసీపీ మేయర్ అభ్యర్ధుల జాబితా ప్రాధమికంగా ఖరారు చేయనున్నారు. దీంతో.. జగన్ స్థానిక ఎన్నికల వేళ తీసుకునే నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications
