''పాపానికి ఓటు వేయాలని దేవుడు చెప్పడు, అంతిమ విజయం హీరోదే, బాబుకు ఉరిశిక్షైనా తక్కువే''

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు చేసిన నేరాలు, మోసాలకు ఉరిశిక్ష విధించినా తక్కువేనని ఆయన అన్నారు. మాట తప్పిన వారిని ప్రజలు కాలర్ పట్టుకొని నిలదీయాలన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మానసికస్థితి సక్రమంగా లేని కారణంగా ఈ రకంగా మాట్లాడుతున్నారని టిడిపి నేతలు ఆరోపించారు.

నంద్యాల: 2009లో 'పిఆర్‌పి' అభ్యర్థికి 35 వేల ఓట్లు, 'పవన్' మద్దతు కీలకం

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు ఈ నెల 23వ, తేదిన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను వైసీపీ, టిడిపిలు తమ శక్తులను వినియోగిస్తున్నాయి.

జగన్ ఎఫెక్ట్:: ఈసీ ఏం చేయనుంది? వైసీపీకి టిడిపి చెక్ ఇలా...

ఈ తరుణంలోనే వైసీపీ చీప్ వైఎస్ జగన్ నంద్యాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నెల 3వ, తేదిన జగన్ నంద్యాలలో నిర్వహించిన సభలో చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీ వివరణకు కోరింది. ఈసీకి వివరణ కూడ పంపారు. అంతేకాదు ఈ నెలయ 10వ, తేదిన కూడ ఎన్నికల ప్రచార సభలో కూడ జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జగన్ ఎఫెక్ట్: అఖిలప్రియ ధర్నా,ఈసీకి టిడిపి ఫిర్యాదు, పీకే వ్యూహంతోనే...

ఈ వ్యాఖ్యలను ఈ నెల 11వ, తేదిన కూడ కొనసాగించారు. చంద్రబాబుకు ఉరిశిక్ష విధించినా తక్కువే అన్నారు. కాలర్ పట్టుకొని చంద్రబాబును నిలదీయాలని ఆయన బాబుపై విమర్శలు గుప్పించారు.

అంతిమ విజయం హీరోదే

అంతిమ విజయం హీరోదే

ఎన్నికల ప్రచార సభలో భాగంగా జగన్ నంద్యాల నియోజకవర్గంలోని పోలూరులోని నిర్వహించిన సభలో ఓ కథ చెప్పారు. ఏ సినిమాలోనైనా మొదటి నుండి విలన్ ..హీరోపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారని చెప్పారు. అయితే అంతిమ విజయం మాత్రం హీరోదేనని చెప్పారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఏది చదివినా అన్యాయం చేసేవారిదే చివరివరకు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు చేసినా చివరకు వైసీపీ మాత్రమే విజయం సాధిస్తోందన్నారాయన.

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
దేవుడు పాపానికి ఓటు వేయమని చెప్పడు

దేవుడు పాపానికి ఓటు వేయమని చెప్పడు

రాజధాని బూములు, గుడి భూములు, ఇసుక, మట్టి .... ఇలా దేన్ని కూడ చంద్రబాబునాయుడు వదల్లేదన్నారు జగన్. మూడేళ్ళుగా అన్నింట్లో కూడ ఆయన అక్రమాలకు పాల్పడ్డాడని ఆయన చెప్పారు. ఏ దేవుడు కూడ పాపానికి ఓటు వేయాలని చెప్పడని జగన్ అన్నారు. మూడేళ్ళ నుండి అన్యాయమే రాష్ట్రంలో రాజ్యమేలుతోందన్నారు.

బాబుకు ఉరిశిక్ష విధించినా తక్కువే

బాబుకు ఉరిశిక్ష విధించినా తక్కువే

మూడేళ్ళుగా చంద్రబాబు చేస్తున్న తప్పులకు ప్రజలు ఓటుతో చరమగీతం పాడాలని వ్యాఖ్యానించారు.చంద్రబాబు చేసిన నేరాలు, మోసాలకు ఉరిశిక్ష విధించినా తక్కువేనని జగన్ వ్యాఖ్యానించారు. మాట తప్పిన వారిని ప్రజలు కాలర్ పట్టుకొని నిలదీస్తారని చెప్పారు.వివాదాస్పద వ్యాఖ్యలతో జగన్ తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు.

 జగన్ మానసిక స్థితి బాగాలేదు

జగన్ మానసిక స్థితి బాగాలేదు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మానసికస్థితి సరిగా లేదని మంత్రి కాలువ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఓటమి అవుతారని తెలిసి ఏం చేయాలో తోచన జగన్ ఈ రకంగా మాట్లాడుతున్నారని కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp chief Ys Jagan made allegations again on Ap chief minister Chandrababu naidu. Ys Jagan conducted road show in polur at Nandyala segment on Friday.
Please Wait while comments are loading...