వైసీపీ బిగ్ షాక్...! ఆదోనీ కాలేజ్ బిడ్ వేసింది డాక్టర్ కూడా కాదా ?

ఏపీలో గత వైసీపీ హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మాణం కోసం కూటమి సర్కార్ తాజాగా టెండర్లు పిలిచింది. ఇలా మొత్తం నాలుగు మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు పిలిస్తే అందులో కేవలం ఆదోనీ కాలేజీ కోసం మాత్రం కిమ్స్ ఆస్పత్రి నుంచి టెండర్ వచ్చినట్లు ముందు ప్రకటించింది. ఆ తర్వాత కిమ్స్ తమకు సంబంధం లేదని చెప్తే, సారీ అందులో పనిచేసే డాక్టర్ ప్రేమ్ చంద్ షా ఈ టెండర్ వేశారని వెల్లడించింది. దీంతో విపక్ష వైసీపీకి కొత్త అస్త్రాలు దొరికాయి.

ఈ నేపథ్యంలో ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం బిడ్ దాఖలు చేసిన కిమ్స్ ఆస్పతి డాక్టర్ ప్రేమ్ చంద్ షా ఎవరని వైసీపీ వెతకడం మొదలుపెట్టింది. ఇందులో మరో షాకింగ్ వాస్తవం వెల్లడైందని పార్టీ నేత పేర్ని నాని తాజాగా ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రిలో బాత్రూంలు కడిగే వాడితో ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 కిమ్స్ ఆసుపత్రుల్లో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేడని తేలిందని పేర్ని నాని వెల్లడించారు.

YSRCP Exposes KIMS Doctor Who Secretly Bid for Adoni Medical College Project

ఎక్కడో ఒక దగ్గర బాత్రూములు కడిగే అతను ఉన్నాడు అతని పేరు చివర షా కూడా లేదు, అదీ మీ భాగోతం అంటూ టీడీపీపై వైసీపీ నేత పేర్ని నాని సెటైర్లు గుప్పించారు. చంద్రబాబు వంట మనుషులతో ఎంఓయూ చేసుకున్నాడు అని గతంలో కేసీఆర్ అన్నారని, ఇప్పుడేమైంది మరి బాత్రూములు కడిగే వాడితో టెండర్ వేయించలేదా? అని పేర్ని ప్రశ్నించారు. మా కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ ఉన్నాడు అని యాజమాన్యంతో లేఖ విడుదల చేయిస్తే, తాను చంద్రబాబు నాయుడికి శిరస్సు వంచి బహిరంగ క్షమాపణ చెప్తానని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+