వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిల్లీలో లో వైసిపి వంచ‌న పై గ‌ర్జ‌న, జాతీయ నేతలు సైతం : టిడిపికి చెక్ పెట్టేందుకేనా..!

|
Google Oneindia TeluguNews

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపిలోని ప‌లు జిల్లాల్లో వైసిపి నిర్వ‌హిస్తున్న వంచ‌న పై గ‌ర్జ‌న ను ఇక ఢిల్లీలో నిర్వ‌హించాల‌ని వైసిపి అధినాయ‌కత్వం నిర్ణ‌యించింది. టిడిపి నిర్వ‌హిస్తున్న ద‌ర్మ పోరాట దీక్ష‌లు..వైసిపి నిర్వ‌హిస్తున్న వంచ‌న దీక్ష‌ల‌తో ఏపిలో పోటీ వాతావ‌ర‌ణం నెలకొంది. కేంద్రం పై వైసిపి ఏం మాట్లాడ‌టం లేద‌నే విమ‌ర్శ‌లు తిప్పి కొడుతూ..టిడిపికి చెక్ పెట్టేందుకే వైసిపి ఢిల్లీలో దీక్ష నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 27న వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో వంచ న పై గర్జ' దీక్షను నిర్వహించాల‌ని నిర్ణ‌యించింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద డిసెంబర్‌ 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్ర‌క‌టించాయి.

YSRCP Garjana at Delhi : Demanding Special Status..

ఇప్ప‌టికే ఏపిలో టిడిపి కేంద్రం పై పోరాటం పేరుతో ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తోంది. మ‌రో రెండు ప్రాంతాల్లో ఈ దీక్ష‌ల‌ను నిర్వ‌హించా ల్సి ఉంద‌ని..త్వ‌ర‌లోనే నిర్వ‌హిస్తామ‌ని టిడిపి అధినేత ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో..వైసిపి ప్ర‌ధాని మోదీ పైనా..కేంద్రం పైనా మాట్లాడేందుకు భ‌య‌ప‌డుతోంద‌నే టిడిపి విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగానే వైసిపి ఢిల్లీ కేంద్రం గా ఈ దీక్ష నిర్వ‌హ‌ణ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

జాతీయ నేత‌ల‌కూ ఆహ్వానం..

ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. సిట్టింగ్ స‌భ్యులుగా టిడిపి ఎంపీలు..రాజీనామా చేసిన వైసిపి ఎంపీలు..పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేక హోదా కోసం నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో.. ఏపి కి చేస్తున్న అన్యాయం పై ముఖ్య‌మంత్రి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఢిల్లీలో భారీ ఎత్తున కార్య‌క్ర‌మం నిర్వహిం చి..కేంద్రం పై ఒత్తిడి పెంచ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు. పార్ల‌మెంట్ జ‌రుగుతున్న స‌మ‌యం కావ‌టంతో మ‌ద్ద‌తిచ్చే పార్టీల నేత‌లను ఈ దీక్ష‌కు ఆహ్వానిస్తున్న‌ట్లు నేత‌లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి జాతీయ స్థాయిలో బిజెపీయ‌త‌ర పార్టీల కూట‌మి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి..వైసిపి నేత‌లు నిర్వ‌హించే ఈ దీక్ష‌కు ఎంత మంది జాతీయ పార్టీల నేతలు మ‌ద్ద‌తిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపి లో పోటా పోటీగా పోరాట స‌భ‌లు నిర్వ‌హిస్తున్న రెండు పార్టీలు..ఇప్పుడు ఢిల్లీ వేదిక‌గా త‌మ స‌త్తా చాటేందుకు సిద్దం అవుతున్నాయి.

English summary
YCP decided to organise Vandhana pi Garjana in Delhi on 27th this month. YCP invited national leaders for this Garjana. At jantar mantar YCP conducting this Garjana programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X