వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ జాబ్ మేళాల వెనుక ? జాబ్ క్యాలెండర్ వైఫల్యం-నిరుద్యోగుల్లో వ్యతిరేకత తగ్గించే యత్నం

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ సర్కార్ తమ ఎన్నికల హామీ అయిన జాబ్ క్యాలెండర్ ఊసెత్తడం లేదు. గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పూర్తిగా అమలైందో లేదో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు. అప్పట్లో ఏటా వేలాది ఉద్యోగాలు ఇస్తామని ఊరించి వెయ్యి ఉద్యోగాలకే సరిపెట్టడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. దీన్ని కాస్తయినా తగ్గించేందుకు ఇప్పుడు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

 వైసీపీ జాబ్ మేళాల హంగామా

వైసీపీ జాబ్ మేళాల హంగామా

ఏపీలో వైసీపీ పార్టీ తరఫున ప్రాంతీయ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాలు ముందుగా తిరుపతిలో ప్రారంభమయ్యాయి. అనంతరం వైజాగ్ లో జరిగింది. ఇవాళ్టి నుంచి గుంటూరు జిల్లాలోని నాగార్జున వర్సిటీలో నిర్వహిస్తున్నారు. ఇందులో వేలాది ఉద్యోగాలను ప్రైవేటు సంస్ధల సాయంతో ఇప్పిస్తున్నారు. అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భారీ ఏర్పాట్లు చేసి మరీ ఈ జాబ్ మేళాల్ని నిర్వహిస్తున్నారు.

 జాబ్ క్యాలెండర్ వైఫల్యంతో

జాబ్ క్యాలెండర్ వైఫల్యంతో

రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో జాబ్ క్యాలెండర్ అమలు కూడా ఒకటి. ఏటా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మరీ ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత అట్టహాసంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పూర్తిగా నిరాశపరిచింది. అందులో భారీ ఉద్యోగాలు ఉంటాయని ఆశించిన యువతకు నిరాశ ఎదురైంది. దీంతో విపక్షాలు కూడా జాబ్ లెస్ క్యాలెండర్ అంటూ విరుచుకుపడ్డాయి. అయినా దీనిపై వైసీపీ సర్కార్ ఏమీ చేయలేని పరిస్ధితి.

 నిరుద్యోగుల్లో అసంతృప్తి తగ్గించే యత్నం ?

నిరుద్యోగుల్లో అసంతృప్తి తగ్గించే యత్నం ?

రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. డిగ్రీలు పూర్తి చేసుకుని మార్కెట్లోకి అడుగుపెడుతున్న యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ అమలు కాకపోవడంతో వారంతా ఉద్యోగాల కోసం తిరిగి హైదరాబాద్ కు పరుగులు తీస్తున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందులు తప్పవు. అందుకే ప్రభుత్వం పార్టీ తరఫున ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ కంపెనీలతో లాబీయింగ్ చేసి మరీ రప్పించి ఉద్యోగార్ధుల కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ప్రచారం లభిస్తుండటంతో వీటికి స్పందన కూడా బాగానే ఉంటోంది.

English summary
ysrcp govt's job melas in andhrapradesh to cover its failure on job calendar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X