వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై..?
సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే టికెట్ దక్కని ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు కొందరు అసంతృప్తి నేతలు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పేరు కూడా వినిపిస్తోంది.
2009 నుంచి 2019 వరకు చీరాల ఎమ్మెల్యేగా కొనసాగిన ఆమంచి.. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఆమంచి ఓటమి పాలైయ్యారు. ఓడిపోయినప్పటికీ కూడా అమంచికి జగన్ సముచిత స్థానం కల్పించారు. అయితే ఇదే సమయంలో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీకి మద్దతుగా నిలవడంతో..ఆయన్ను చీరాల ఇంచార్జ్‌గా నియమించిన పార్టీ అధిష్టానం, ఆమంచి కృష్ణ మోహన్‌కు పర్చూరు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది.

అయిష్టంగానే పర్చూరు బాధ్యతలను స్వీకరించిన ఆమంచి..తాజాగా తన మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన వచ్చే ఎన్నికల్లో చీరాల బరిలో ఉంటానని సంకేతాలు ఇచ్చారు. వైసీపీ నుంచి టికెట్ వచ్చిన రాకపోయిన చీరాల బరిలో ఆమంచి కృష్ణమోహన్ నిలుస్తారని ప్రచారం జరుగుతోంది.ఎమ్మెల్యే కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ మధ్య చాలా కాలంగా గ్రూప్‌వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో కరణం బలరాం చీరాల నుంచి పోటీ చేస్తే కచ్చింతంగా తాను కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని ఆమంచి భావిస్తున్నారు. ఒకవేళ వైసీపీ నుంచి టికెట్ రాకపోతే..ఆయన జనసేన , కాంగ్రెస్ పార్టీల్లో చేరడానికి కూడా సిద్దంగా ఉన్నారనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతుంది. ఆమంచికి గతంలో సంతత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన రికార్డు కూడా ఉంది.

దీంతో ఆమంచి మరోసారి ఇండిపెండెట్‌గా పోటీ చేసిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఆమంచి వైసీపీలోనే కొనసాగడానికి అధిష్టానం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications