Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించిన జంగా కృష్ణమూర్తి

Anil Kumar Yadav: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై మాజీ మంత్రి, నరసరావుపేట లోక్‌సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. వాటిని తిప్పి కొట్టారు. జంగాపై ఎదురుదాడికి దిగారు. ఘాటు విమర్శలను చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని, అలాంటి నాయకుల్లో జంగా కూడా ఉన్నారని ఆరోపించారు. ఫేక్ నాయకులే పార్టీలను మారతారంటూ మండిపడ్డారు. జగన్‌ను అభిమానించేవారు ఎప్పటికీ పార్టీ మారబోరని, కనీసం ఆ ఆలోచన కూడా చేయరని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

YSRCP leader Anil Kumar Yadav slams Janga Krishna Murthy

ఈ ఉదయం నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ పోటీ చేస్తారని, ఆయనను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు అనిల్ కుమార్ యాద‌వ్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు విజయం సాధించానని గుర్తు చేశారు.

ఈ సారి నెల్లూరు సిటీ అభ్యర్థిగా మైనారిటీ నాయకుడికి వైఎస్ జగన్ అవకాశం కల్పించారని, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు. ఒకరిద్దరు నాయకులు పార్టీని వీడి వెళ్లినా ఎలాంటి ఇబ్బందీ లేదని వ్యాఖ్యానించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు తనను బాధ కలిగించాయని అనిల్‌ కుమార్‌ యాదవ్ అన్నారు. నాలుగున్నర సంవత్సరాల పాటు ఆయనకు వైఎస్ జగన్ దేవుడిలా కనిపించారని, ఆయన వల్లే పదవులు పొంది ఎదుగిన తరువాత పార్టీని వీడేటప్పుడు మాత్రం అకారణంగా ఆరోపణలు చేస్తోన్నారని అన్నారు.

జంగా కృష్ణమూర్తికి 2014లో టికెట్ ఇచ్చారని, ఆ ఎన్నికల్లో ఓడిపోతే అక్కున చేర్చుకుని ఎమ్మెల్సీ ఇచ్చారని అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయమని జంగా కృష్ణమూర్తికి కూడా జగన్ చెప్పారని, ఆయన వద్దనుకుంటేనే తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు.

టీడీపీ ఎంతమంది బీసీ నేతలకు టికెట్లు ఇచ్చిందో జంగా కృష్ణమూర్తి చెప్పాలని నిలదీశారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో బీసీల్లో ఎవరికైనా టీడీపీ టికెట్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ద్వారా బాగా సంపాదించుకొని మళ్లీ ఆయనను విమర్శించడం ఫ్యాషన్‌గా మారిందంటూ ధ్వజమెత్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+