వైసీపీ ఎమ్మెల్యేలకు పిలుపు, కీలక మార్పులు - ఎలక్షన్ టాస్క్‌ఫోర్స్‌..!!

ఏపీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల పైన పూర్తి ఆధిపత్యం కొనసాగించేలా సీఎం జగన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వై నాటం 175 నినాదంతో పార్టీ శ్రేణులకు బస్సు యాత్ర..ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి పంపారు. ప్రతిపక్షాలు పొత్తులతో సీఎం జగన్ లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ సమయంలోనే నియోజకవర్గాల్లో ఎన్నికల సమయం వరకు ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకొనే కొత్త కార్యాచరణకు వైసీపీ సిద్దం అవుతోంది.

పార్టీ నేతలతో సమావేశం : పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లతో వైసీపీ నాయకత్వం సమావేశం కానుంది. ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న నేతలకు నియోజవకర్గంలో అందుబాటులో ఉండేలా కొత్త వ్యవస్థకు వైసీపీ శ్రీకారం చుడుతోంది. నియోజకవర్గంలో ఇప్పటికే పరిశీలకులను పార్టీ ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యుల నియామకం పైన ఫోకస్ చేసింది. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు సూచించిన వారికే పార్టీలో ప్రత్యేక బాధ్యులుగా నియమించాలనే ఆలోచన జరుగుతోంది. పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ నమ్ముకున్న వైసీపీ అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా స్థానిక పరిస్థితులు ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వానికి సమాచారం ఇచ్చేలా వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు.

YSRCP Leader ship to hold cruical meeting with party incharges, may give Electio Road map

నియోజకవర్గాల్లో బాధ్యులు : ఇందు కోసం పార్టీ బాధ్యులతో పాటుగా ప్రతీ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం..కంట్రోల్ రూమ్ తరహాలో పని చేసేలా కొత్త నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో పార్టీ ప్రచారం..పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు..కార్యకర్తల ఫీడ్ బ్యాక్ ఆధారంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎప్పటికిప్పుడు సమాచారం అందించేలా వ్యవస్థను సిద్దం చేస్తున్నారని చెబుతున్నారు.

దీని ద్వారా ఎన్నికల సమయంలో సాధారణంగా ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్స్..ఇప్పటి నుంచే నిర్వహించటం ద్వారా ఏ నియోజకవర్గంలోనూ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలనేది పార్టీ నాయకత్వం ఆలోచనగా గెలుస్తోంది. ప్రతీ పోలింగ్ బూత్ కేంద్ర నుంచి రాష్ట్ర కార్యాలయం వరకు..ప్రతీ ఇంటి నుంచి ఎమ్మెల్యే -ఇంఛార్జ్ వరకు అనుసంధానం అయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది.

కీలక నిర్ణయాల దిశగా : ఇదే సమయంలో ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అదే రోజున పార్టీ నేతలతోనూ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సారి కేబినెట్ భేటీలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇక, ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయం కావటంతో ఇటు రాజకీయంగా పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు..మార్పులు - చేర్పులకు సీఎం జగన్ సిద్దం అవయ్యారు. అదే విధంగా ప్రభుత్వ పరంగా ఇక నిర్ణయాల వేగంగా పెంచాలని భావిస్తున్నారు. ఈ నెల 31న అటు కేబినెట్ సమావేశంలో..ఇటు పార్టీ సమావేశంలోనూ కీలక నిర్ణయాలు ఉంటాయని సమాచారం. దీంతో, ఆ రోజున తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+