బిజెపిలో చేరిన జగన్ పార్టీ నేత వెంకట్రావు: బాబు సాహసం చేస్తున్నారన్న గాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపి హరిబాబు కంభంపాటి హరిబాబు సమక్షంలో వెంకట్రావుతోపాటు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బిజెపిలో చేరారు. విశాఖపట్నంలో జరుగుతున్న బిజెపి సభ్యత్వ నమోదు సందర్భంగా వీరందరూ ఆ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీగా బిజెపిని పటిష్ఠం చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని అన్నారు.
జగన్ ధర్నాలు విడ్డూరంగా ఉన్నాయి: గాలి
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు.
రుణమాఫీపై జగన్ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రుణమాఫీ చేయలేనన్న జగన్.. ఇప్పుడు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చంద్రబాబు చేస్తుంటే.. కనీసం పరిజ్ఞానం లేకుండా జగన్ విమర్శిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications