డీకే శివకుమార్ కు సాయిరెడ్డి కంగ్రాట్స్ - లైన్ క్లియర్..!?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. బీజేపీని ఓడించింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపిక మొదలైంది. ఈ సాయంత్రం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తున్నారు. డీకే శివకుమార్..సిద్దరామయ్య మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ సమయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపైన వైసీపీ పార్లమెంటరీ నేత విజయ సాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి..డీకే శివకుమార్ కు కంగ్రాట్స్ చెప్పారు.
I congratulate the Congress Party on winning the Karnataka State Elections. My best wishes to them on govt. formation and working towards fulfilling their promises made to the people of Karnataka. @INCIndia @DKShivakumar
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 13, 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ముఖ్యనేత ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియ చేసారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారుకర్ణాటక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. సాయిరెడ్డి తన ట్వీట్ ను కాంగ్రెస్ తో పాటుగా సీఎం రేసులో ప్రముఖంగా నిలిచిన డీకే శివకుమార్‌కు ట్యాగ్ చేసారు. కంగ్రాట్స్ చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తీరు ను అనేక సందర్భాల్లో సాయిరెడ్డి విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల విషయంలో అభినందించారు.

సాయిరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ తో పాటుగా డీకే శివకుమార్ కు ట్యాగ్ చేయటం ఆసక్తి కరంగా మారుతోంది. కర్ణాటక కొత్త సీఎం ఎవరనేది ఈ రోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ విజయంలో డీకే శివ కుమార్ కీలక పాత్ర పోషించారు. పార్టీ ఆర్దిక వ్యవహారాలతో పాటుగా రాజకీయ వ్యూహాల్లో సమర్ధంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ 136 సీట్లలో గెలుస్తుందని ఫలితాలకు ముందే డీకే తన అంచనాలను వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం సీఎంగా ఎవరికి అవకాశం ఇస్తుందనే సమయంలో విజయ సాయిరెడ్డి ఈ ట్వీట్ చేసారు. డీకే కు సీఎంగా అయ్యే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలతో సాయిరెడ్డి ఈ ట్వీట్ చేసారా అనే ఆసక్తి కర చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది.












Click it and Unblock the Notifications