వైసీపీ బంద్: బెజవాడలో కొడాలి నాని, వంగవీటి రాధ అరెస్ట్

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్ సంపూర్తిగా కొనసాగుతోంది. చాలా చోట్లప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతుగా దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్ధలను మూసి వేశారు. పెట్రోల్ బంక్‌లు, సినిమాహాళ్లు పని చేయడం లేదు.

విజయవాడలో ఉదయం 5 గంటలకే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారధి, కొడాలి నాని, వంగవీటి రాధ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. తిరువూరులో ఎమ్మెల్యే రక్షణ నిధి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.

జగ్గయ్య పేట బస్ డిపో ముందు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో వైయస్ఆర్ పార్టీ కార్యకర్తలు బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకుంటున్నారు. ఇక అవనిగడ్డలో తెల్లవారు జామున 3.30 గంటల నుంచి బంద్ కొనసాగుతోంది.

ysrcp leaders arrested by following of bandh demand for ap special status

మరోవైపు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట నేలకూరు పారిశ్రామిక వాడలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కార్యక్రమంలో వందలాది మంది కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ బంద్‌కు వామపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాల కార్యకర్తలు మద్ధతు ప్రకటించారు.

ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలకు వెళ్లే బస్సులకు బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+