కాకుమాను హఠాన్మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం: వైవీ సుబ్బారెడ్డి, సజ్జల ధ్వజం!

అధికారం ఉందని పోలీసు వ్యవస్థను కిరాయి సైన్యంలా వాడుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న చేస్తున్న దారుణాల వల్లే కాకుమాను రాజశేఖర్ విగత జీవిగా మారారని వైసీపీ నేతలు మండిపడ్డారు. కాకుమాను హఠాన్మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం అన్నారు. కాకుమాను రాజశేఖర్‌ మరణం పార్టీకి తీరని లోటని వారు గుర్తు చేశారు.

మరో కొత్త పథకంతో ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు!
మరో కొత్త పథకంతో ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు!

హైదరాబాద్‌లో గురువారం హఠాన్మరణానికి గురైన వైయస్సార్‌సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ పార్థివ దేహానికి ఆయన స్వస్థలమైన ఒంగోలులో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారు, ఆయన పార్టీకి చేసిన సేవలు స్మరించుకున్నారు.

YSRCP leaders on kakumanu death Chandrababu Government is the reason for Kakumanu Rajasekhar Death

డీఎస్సీలో అక్రమాలపై విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో పోలీసులు చేసిన దాడి, వారి తోపులాటల వల్ల రాజశేఖర్‌ రెండు మూడు సార్లు కింద పడిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారన్నారు. ఆ దుర్ఘటనే ఆయన మరణానికి ప్రధాన కారణమని పార్టీ నాయకులు, కాకుమాను కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గానికి, కిరాయి సైన్యంలా మారిన పోలీస్‌ యంత్రాంగ అరాచకాలకు నిదర్శనమని వారు ధ్వజమెత్తారు.

 వర్ష బీభత్సం, ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
వర్ష బీభత్సం, ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

కాకుమాను రాజశేఖర్ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన యోధుడన్నారు. ఆయన కుటుంబానికి వైయస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఒంగోలు పట్టణంలో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్, ఆ తర్వాత వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన కాకుమాను రాజశేఖర్‌ నిరంతరం ప్రజా సమస్యలపైనే పోరాడారన్నారు.

ఇటీవల కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారని గుర్తు చేశారు. డీఎస్సీలో అక్రమాలపై ఈనెల 22న విజయవాడ, శాప్‌ ఆఫీస్‌ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్‌పై పోలీసుల దాడితో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. ఒంగోలు చేరుకున్న తర్వాత కూడా పోలీసులు అక్రమ కేసులు బనాయించారన్న వార్తలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని తెలిపారు.

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే తుదిశ్వాస విడిచారు. కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్న ఒత్తిళ్లు, నమోదు చేస్తున్న అక్రమ కేసుల వల్లే ఒక సీనియర్‌ నేత ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలే గమనిస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిత్యం చురుగ్గా పనిచేస్తూ, ప్రచార కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన నిజమైన సహచరుడిని కోల్పోవడం పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన ఘోరమైన అక్రమాలపై యువత పక్షాన నిలబడి పోరాటం చేస్తే కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని దాడి చేయించిందన్నారు.అర్ధరాత్రిళ్లు ఇళ్లపై పడి టెర్రరిస్టుల మాదిరిగా వేధించడంతో విపరీతమైన ఆందోళనకు గురై ఆస్పత్రి పాలయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతాం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+