వైసీపీకి మరో ఎన్నికల ఓటమి ! మళ్లీ గెలిచిన టీడీపీ ! ఈసారి ఎక్కడంటే ?
ఏపీలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీకి రాష్ట్రంలో ఈ ఏడాది జరుగుతున్న ఎన్నికల్లో వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్ధానాల్ని టీడీపీకి కోల్పోయిన వైసీపీకి తాజాగా మరో ఓటమి ఎదురైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఓడిన వైసీపీ.. ఈసారి అమరావతి ప్రాంతంలో ఓటమి పాలైంది.
గుంటూరు బార్ అసోసియేషన్ కు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఎదురైంది. వైసీపీ నిలబెట్టిన అభ్యర్ధి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాసు వెంకటరెడ్డిపై టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు రెగ్యులర్ ఎన్నికల తరహాలో మోహరించాయి. తమ అభ్యర్ధుల్ని గెలిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే వైసీపీ అభ్యర్ధి కాసు వెంకటరెడ్డిని టీడీపీ లీగల్ సెల్ సెక్రటరీ కూడా అయిన కేవీకే సురేష్ ఓడించారు. గుంటూర్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా దాసరి ఉమ గెలుపొందారు.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై పార్టీలో సమీక్షించేందుకు సీఎం వైఎస్ జగన్ ఎల్లుండి ఎమ్మెల్యేలతో కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేబినెట్ మార్పుతో పాటు ముందస్తు ఎన్నికలపైనా జగన్ సంకేతాలు ఇస్తారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్నివైసీపీ కోల్పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది. గుంటూర్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్ధికి లీగల్ సెల్ శుభాకాంక్షలు తెలిపింది.












Click it and Unblock the Notifications