వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్డు మెంబర్ గా కూడా గెలవలేని సన్నాసికి సమాధానం చెప్పాలా : లోకేష్ కు కొడాలి నాని కౌంటర్

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన విమర్శలకు వైసీపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ మరియు మందుల కొరతపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొడాలి నాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు టీడీపీ నేత లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఐపీఎల్ మ్యాచ్ లతో జగన్, ప్రజల ప్రాణాలు గాల్లో.. పరీక్షల రద్దుపై 'కంస మామ' : లోకేష్ ఫైర్ ఐపీఎల్ మ్యాచ్ లతో జగన్, ప్రజల ప్రాణాలు గాల్లో.. పరీక్షల రద్దుపై 'కంస మామ' : లోకేష్ ఫైర్

 లోకేష్ లాంటి చవట, సన్నాసికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు

లోకేష్ లాంటి చవట, సన్నాసికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా లోకేష్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. లోకేష్ ఒక పనికిమాలిన వెధవని హైదరాబాద్లో కూర్చొని ట్వీట్లు పెట్టడం లోకేష్ కి అలవాటు అని మండిపడ్డారు . ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధినో , అధికారులో ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ, లోకేష్ లాంటి చవట, సన్నాసికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వెధవ మాట్లాడితే పట్టించుకుంటామా అంటూ కొడాలి నాని తనదైన శైలిలో లోకేష్ పై విరుచుకుపడ్డారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లో 100 టన్నులు ఏపీకే

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లో 100 టన్నులు ఏపీకే


రాష్ట్రంలో కరోనా పరిస్థితులను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తయారుచేసే 170 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌లో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభిస్తోందని కొడాలి నాని పేర్కొన్నారు. మిగిలిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయబడుతుందని ఆయన అన్నారు. 70 మెట్రిక్ టన్నులు పక్కనే ఉన్న మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నామని కొడాలి నాని స్పష్టం చేశారు. విజయవాడలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఉందన్న ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను మంత్రి ఖండించారు.

కరోనా కట్టడిలో జగన్ సర్కార్ విఫలం అయిందన్న ప్రతిపక్ష పార్టీల నేతలు

కరోనా కట్టడిలో జగన్ సర్కార్ విఫలం అయిందన్న ప్రతిపక్ష పార్టీల నేతలు

ఒకపక్క రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డికి పట్టింపు లేదని మండిపడుతున్నారు. ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

 రివర్స్ కౌంటర్ ఇస్తున్న వైసీపీ మంత్రులు

రివర్స్ కౌంటర్ ఇస్తున్న వైసీపీ మంత్రులు

ఇక ప్రతిపక్ష పార్టీల నేతల వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు కొట్టిపారేస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతుందని వైసీపీ మంత్రులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఆపద సమయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదని ప్రతిపక్షాలకు హితవు పలుకుతున్నారు. వైద్య సదుపాయాల కొరత లేకుండా చర్యలు చేపట్టామని చెప్తున్నారు . ప్రజలు మాత్రం స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు .

English summary
Responding to TDP national general secretary Nara Lokesh comments over oxygen and medicine shortage in covid hospitals, Minister Kodali Nani slammed him for making baseless allegations against the Andhra Pradesh government. He stated that Lokesh is talking from Hyderabad without checking the ground reality in AP. To a question, Nani mentioned that AP is getting 100 out of 170 metric tonnes of medical oxygen manufactured by the Visakhapatnam Steel Plant. The remaining oxygen is supplied to other states, he added. The minister refuted charges of oxygen shortage in hospitals located in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X