
పార్టీ లేదు - గాడిదగుడ్డూ లేదు : రేపు మరో పార్టీలో : వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..!!
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తమ వ్యాఖ్యలతో రాజకీయంగా వేడి పుట్టిస్తున్నారు. స్థానికంగా సొంత పార్టీలో వర్గపోరు..ఆధిపత్యం.. అధికారులు మాట వినటం లేదని కొందరు..ఇలా రకరకాల కారణాలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ మనసులోని అసహనాన్ని బయట పెడుతున్నారు. తాజాగా.. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. స్థానికంగా ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

రేపు ఏ పార్టీలో ఉంటారో
పార్టీ
లేదు
గాడిద
గుడ్డు
లేదు..ఇప్పుడున్న
వారు
రేపు
ఇదు
పార్టీలో
ఉంటారో
లేదో
తెలియదన్నారు.
ఎవరు
ఏ
పార్టీలో
ఉంటారో
ఎవరికీ
తెలుసు
అంటూ
వ్యాఖ్యానించారు.
అదే
సమయంతో
తన
గురించి
చెప్పుకొచ్చారు.
తాను
వైసీపీలో
శాశ్వతమా
అని
ప్రశ్నించారు.
రేపన్న
రోజున
ఎవరు
ఏ
పార్టీలో
ఉంటారు..
ఏ
పార్టీ
నుంచి
పోటీ
చేస్తారో
తెలియదంటూ
చెప్పుకొచ్చారు.
దీనికి
కొనసాగింపుగా
పెన్షన్
తీసుకునే
సామాన్యుడు
ఇన్‌కమ్
టాక్స్
కట్టగలడా
అంటూ
సెటైర్లు
వేశారు.
తమకు
ఇప్పుడు
బాధ్యత
ఇచ్చారని..అవి
చేసేందుకు
మందుకు
వెళ్తున్నామని
వివరించారు.

సొంత పార్టీపైనే అసహనంతో
ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు.. నియోజకవర్గంలో పార్టీలో ఉన్న సమస్యల కారణంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేసారా..లేక పార్టీ పైన మరో ఉద్దేశంతో ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కొంత కాలంగా తాను ఏం పనులు అడిగినా అవి జరగటం లేదనే భావనతో చంటిబాబు ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో..పార్టీ తీరు పైన ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే ఈ రకమైన తనలోని అసహనాన్ని బయట పెట్టారని చెబుతున్నారు.

రాజకీయంగా వైసీపీలో చర్చ
చంటిబాబు వలన నియోజకవర్గానికి ఎటువంటి ప్రయోజనం లేదంటూ మరో వైపు స్థానిక టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా జగ్గంపేట వైసీపీ..టీడీపీకి రెండు పార్టీలకు కీలకమైన ప్రాంతం. గోదావరి జిల్లాలు గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయి. అందునా..రానున్న ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారబోతున్నాయి. ఈ సమయంలో..సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన వైసీపీలో కొనసాగటం పైన చర్చకు అవకాశం ఏర్పడింది.