పోటాపోటీ దీక్షలు: చంద్రబాబుకు పార్థసారథి వార్నింగ్, తాబేదారు అంటూ పవన్ కళ్యాణ్‌పై..

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టనున్న ఇసుక దీక్షకు పోటీగా తాను కూడా చేస్తానంటూ ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి. తనపై చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

జగన్ రెడ్డి గారూ! ఇది మీకు సిగ్గుచేటు.. చిల్లరగానా..: టీడీపీలా కాదంటూ ఏకిపారేసిన పవన్ కళ్యాణ్

పరువునష్టం దావా వేస్తా..

పరువునష్టం దావా వేస్తా..

బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాలో తనను అనవసరంగా ఇరికించారంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రంలోగా ఆధారాలు చూపించాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

చంద్రబాబుకు సవాల్

చంద్రబాబుకు సవాల్

అంతేగాక, తాను కూడా రేపు చంద్రబాబు దీక్ష పక్కనే దీక్ష చేస్తానని పార్థసారథి స్పష్టం చేశారు. పలానా స్థలంలో ఇసుక డంప్ చేసి కొరతను సృష్టించానని, లేదా పలానా క్వారీ నుంచి ఇసుకను తరలించి కొరతను సృష్టించానని నిరూపించగలరా అంటూ చంద్రబాబుకు పార్థసారథి సవాల్ విసిరారు. ధర్నా చౌక్ వద్ద తన దీక్షకు అనుమతించాలని హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులను ఆయన కోరారు. నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ కూడా రాశారు.

అది అబద్ధాల పుట్ట..

అది అబద్ధాల పుట్ట..

చంద్రబాబు హయాంలో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా పోగేశారని పార్థసారథి ఆరోపించారు. మీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి మర్చిపోయారా? అంటూ చంద్రబాబుకు చురకలంటించారు. టీడీపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్ అబద్ధాల పుట్ట అని, బీసీ నేతలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు.

అందుకేనా దీక్ష..

అందుకేనా దీక్ష..

ఇసుకను అన్నంలా తిన్న చరిత్ర చంద్రబాబుదని, తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష అని మండిపడ్డారు. నదుల్లో వరద ఉధృతంగా ఉండటం వల్లే కొంత ఇసుక కొరత ఉందన్నారు. వరద తగ్గిన తర్వాత పూర్తిస్థాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

తాబేదారు పవన్ కళ్యాణ్‌తో కలిసి బాబు నటకాలు

తాబేదారు పవన్ కళ్యాణ్‌తో కలిసి బాబు నటకాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదని పార్థసారథి వ్యాఖ్యానించారు. నాడు వ్యవస్థలను నాశనం చేసిన చంద్రబాబు అవినీతికి పట్టం కట్టారని.. ఇప్పుడు తన తాబేదారు పవన్ కళ్యాణ్‌తో కలిసి నాటకం ఆడుతున్నారని విమర్శించారు. కాగా, పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ సర్కారు ఇసుక విధానంపై మండిపడుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+