అమెరికాలో రోడ్డు ప్రమాదం-వైసీపీ ఎమ్మెల్యే బంధువుల దుర్మరణం..
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు ఏపీ వాసుల్ని బలి తీసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన ఐదుగురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
వీరంతా వైసీపీ మమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ బంధువులే. దీంతో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ కుటుంబంలో విషాదం నెలకొంది. టెక్సాస్ హైవేలో జరిగిన ఈ కారు ప్రమాదానికి అసలు కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.

టెక్సాస్ హైవేలో రెండు కార్డు ఢీకొన్న ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చిన్నాన్న కుటుంబం దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎమ్మెల్యే సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామాలక్ష్మి, కూతురు నవీన గంగ, మనవడు, మనవరాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే ప్రమాదంలో నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ కు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications