Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగనన్న ఇళ్లపై ఎమ్మెల్యే ప్రసన్న హాట్‌కామెంట్స్- బెడ్‌రూంలో శోభనం కష్టమే- సైజ్‌ పెంచాల్సిందే

ఏపీలో వైసీపీ ప్రభుత్వం కడుతున్న జగనన్న ఇళ్లపై సొంత పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల నిర్మాణానికి శంఖుస్ధాపన చేసేందుకు వెళ్లిన ఆయన.. మంత్రులు, స్ధానిక ప్రజాప్రతినిధుల ముందే చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సొంత పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక పథకంపై ఆయన చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటిపై అక్కడే ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు.

Recommended Video

    CM Jagan VS Raghurama Krishnam Raju | Oneindia Telugu
    జగనన్న ఇళ్ల నిర్మాణం

    జగనన్న ఇళ్ల నిర్మాణం

    వైసీపీ ప్రభుత్వం గతేడాది పేదలకు భారీ ఎత్తున ఇళ్ల స్ధలాల్ని పంపిణీ చేసింది. వాటిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. జగనన్న కాలనీల పేరుతో నిర్మించే ఈ ఇళ్ల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజైన్లు సైతం రూపొందించింది. కానీ ఇప్పుడు అవి కాస్తా వైసీపీ ఎమ్మెల్యేలకే నచ్చడం లేదు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో వైసీపీ ప్రజాప్రతినిధులు వీటిపై పెదవి విరుస్తున్నారు. దీంతో ఈ అసహనం బహిరంగంగానే తన్నుకొస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరులో స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి జగనన్న ఇళ్లపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.

     జగనన్న ఇళ్లపై ప్రసన్న హాట్‌ కామెంట్స్‌

    జగనన్న ఇళ్లపై ప్రసన్న హాట్‌ కామెంట్స్‌

    జగనన్న ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం గదుల పరిమాణం ఎంతెంత ఉండాలో నిర్ణయించింది. అప్పట్లో దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాత్రం గదుల సైజు తక్కువగా ఉందని వాపోతున్నారు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి జగనన్న ఇళ్లలో రూమ్‌లపై పెదవి విరిచారు. ముఖ్యంగా బెడ్రూమ్‌లు సరిగా లేవన్నారు. అంతటితే ఆగకుండా బెడ్రూమ్‌లో ఏం జరుగుతుందో కూడా ఆయన చెప్పేశారు.

    బెడ్రూమ్‌లో శోభనం కూడా ఇబ్బందే

    జగనన్న ఇళ్లలో నిర్మిస్తున్న బెడ్‌రూమ్‌లు కొత్తగా పెళ్లయిన జంటలలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బెడ్‌ రూమ్‌లు చాలా చిన్నగా ఉన్నాయని, లబ్దిదారులు రాత్రి వేళ బెడ్‌రూమ్‌లో ఏదైనా పనిచేయాలనుకున్నా ఇబ్బందిగా ఉంటుందన్నారు. బెడ్‌ రూమ్‌లో పెద్ద మంచం వేయాల్సి వచ్చినా కష్టంగా ఉంటుందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రసన్న డిమాండ్‌ చేశారు.

    హాల్లో శోభనం, బెడ్‌రూమ్‌లో నిద్ర

    హాల్లో శోభనం, బెడ్‌రూమ్‌లో నిద్ర

    ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్లలో బెడ్‌రూమ్‌ సైజ్ తక్కువగా ఉండయంతో హాల్లో శోభనం చేసుకుని బెడ్‌రూమ్‌లో పడుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఎందుకంటే బెడ్‌రూమ్‌లో పెద్దమంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో కేవలం 6 అంకణాల్లోనే ఇళ్లు నిర్మిస్తున్నారని ప్రసన్న తెలిపారు. కాబట్టిగ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగానే అర్బన్ ప్రాంతాల్లో కూడా 9 అంకణాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+