పేదల భూములను కొట్టేసి ఆస్తుల సంపాదనే బాబు లక్ష్యం: ఆళ్ళ రామకృష్ణారెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu
ఆస్తుల సంపాదనే బాబు లక్ష్యం

అమరావతి: పేదల భూములను కొట్టేసి ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చద్రబాబునాయుడు, టిడిపి నేతలు పనిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

ల్యాండ్ పూలింగ్ పేరుతో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుండి లాక్కొని వారిని రోడ్డున పడేశారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. రికార్డులు తారు మారు చేసి టిడిపి నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Ysrcp MLA Ramakrishna Reddy allegations on chandrababu naidu

శుక్రవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. టిడిపి భూ కబ్జాల సంవత్సరంగా 2017 ను చెప్పొచ్చని ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు.హుద్‌హుద్ తుఫాన్ కారణంగా రెవిన్యూ రికార్డులు మాయం చేసి లక్షల ఎకరాలను కాజేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆ కుంభకోణంపై ఇప్పటివరకు దర్యాప్తు జరగలేదన్నారు.

లక్షలాది మంది రైతు కూలీలు, కౌలు రైతుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయని కోర్టులు మొట్టికాయలు వేసినా టిడిపి సర్కార్‌ తీరు మారలేదన్నారు. గడిచిన మూడున్నర ఏళ్ళలో వేలాది మంది రైతుల జీవితాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp MLA Alla Ramakrishna Reddy made allegations on Ap chief minister Chandrababunaidu and Tdp leaders on Friday at Amaravathi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి