• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పసుపు కుంకుమ తీసుకుని మహిళలు చంద్రబాబుకు ఉప్పు కారం రాశారు .. రోజా తీవ్ర వ్యాఖ్యలు

|

టీడీపీ నేతలపై, చంద్రబాబుపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాల ముందు వరకు సైలెంట్ గా ఉన్న రోజా ఫలితాల తర్వాత తనది గోల్డెన్ లెగ్ అని చెప్పుకున్నారు. తాను ఐరన్ లెగ్ అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వెధవలు అసెంబ్లీలోనూ బయట కూసిన కూతలకు ప్రజలు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదన్నారు. తన ఉసురు చంద్రబాబు నాయుడుకు తగిలిందని ఆమె చెప్పుకొచ్చారు.

తనను చిత్ర హింసలు పెట్టటం వల్లే టీడీపీ భూస్థాపితం కాబోతుంది అన్న రోజా

తనను చిత్ర హింసలు పెట్టటం వల్లే టీడీపీ భూస్థాపితం కాబోతుంది అన్న రోజా

ఇక నగరిలో తనను ఓడించాలని ఎన్నో కుట్రలు చేశారని కానీ నగరి ప్రజలు మాత్రం తనను గెలిపించారన్నారు. తాను ప్రతిపక్షంలో ఉండటంవల్ల నగరిలో అభివృద్ధి చెయ్యలేకపోయానని చెప్పిన రోజా ఇప్పుడు అభివృద్ధిలో నగరిని పరుగులు పెట్టిస్తానని చెప్పుకున్నారు. వచ్చింది రాజన్న రాజ్యం అన్న రోజా ప్రజల కష్టాలు తీరుస్తామని జగన్ సీఎంగా వైఎస్ ను గుర్తు చేసుకునేలా పాలన సాగిస్తారని చెప్పారు. తాను నిత్యం ప్రజల కోసం, అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తిననని స్పష్టం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కోసం అసెంబ్లీలో పోరాడితే అకారణంగా తనను సంవత్సరం పాటు సస్పెండ్ కు గురి చేశారని, తనను ఎన్నో చిత్ర హింసలు పెట్టారని రోజా గుర్తు చేశారు. అందువల్లే చంద్రబాబు ఆయన పార్టీ భూస్థాపితం కాబోతుందన్నారు.

పసుపు కుంకుమ పథకంలో లబ్ది పొందిన మహిళలు చంద్రబాబుకు ఉప్పు కారం రాశారని రోజా ఘాటు వ్యాఖ్యలు

పసుపు కుంకుమ పథకంలో లబ్ది పొందిన మహిళలు చంద్రబాబుకు ఉప్పు కారం రాశారని రోజా ఘాటు వ్యాఖ్యలు

ఇక మహిళాసాధికారికత సమావేశానికి ఆహ్వానించి తనను 24 గంటలపాటు ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో ప్రజలకు తెలుసునన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు నిధులు ఇవ్వకుండా తనను ఓడించాలని ప్రయత్నించారంటూ ఆమె ధ్వజమెత్తారు. ఒక పక్క ఓటమి బాధలో ఉన్న చంద్రబాబుపై రోజా తన మాటల దాడి చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వెధవలు తనను ఐరన్ లెగ్ అంటూ అసెంబ్లీలోనూ బయట కూసిన కూతలకు ప్రజలు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. పసుపు కుంకుమ పథకంలో లబ్ది పొందిన మహిళలు చంద్రబాబుకు ఉప్పు కారం రాశారని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు .

నగరిని అభివృద్ధి బాట పట్టిస్తానంటున్న రోజా

నగరిని అభివృద్ధి బాట పట్టిస్తానంటున్న రోజా

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని హామీ ఇచ్చిన రోజా తాను ఎన్నికల ప్రచారంలో వచ్చేది రాజన్న రాజ్యమేనని చెప్పానని అలాగే జరిగిందన్నారు. వైయస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఎంతలా ప్రజలు సంతోషంగా ఉన్నారో అంతకంటే ఎక్కువగా ప్రజలు సంతోషంగా ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి రోజా ఓడిపోతుంది అని సర్వేలు చెప్పినా రోజా గెలిచి తన సత్తా చాటింది . ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పదవి చేపట్టనుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP former MLA Roja said some survey reports have come in the favour of her party and some are favouring TDP. YSRCP Nagari MLA candidate said they have full faith on the people of the said and added that even the party chief YS Jagan Mohan Reddy has full confidence to win in the election. She said it is her party chief YS Jagan Mohan Reddy only who can govern the state in the line of his late father YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more