Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు కూడ రాని లోకేష్ కు మంత్రి పదవా? బాబుంటే ఎప్పుడూ కరువే: రోజా

తెలుగు కూడ సరిగా మాట్లాడడం రాని లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

అమరావతి: తెలుగు కూడ సరిగా మాట్లాడడం రాని లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను ఆ పార్టీ విస్మరించిందని ఆమె ఆరోపించారు. స్వంత పార్టీ కార్యకర్తలకే ప్రయోజనం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్నారు.

అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతోన్న ప్రజల సమస్యలను గాలికి వదిలేసి స్వప్రయోజనాలకోసమే పాటుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడపై ధ్వజమెత్తారు.

అధికారపార్టీ కార్యకర్తలకు ప్రయోజనం కల్గించేలా వ్యవహరిస్తున్నారని ఆమె అధికారుల తీరును తప్పుబట్టారు. అధికారులు కూడ అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు నడుచుకొంటున్నారని ఆమె ఆరోపించారు.

తెలుగు కూడ రాని లోకేష్ కు మంత్రి పదవా?

తెలుగు కూడ రాని లోకేష్ కు మంత్రి పదవా?

తెలుగు కూడ సరిగా మాట్లాడడం రాని లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం దారుణమన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.అంతేకాదు వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టి చంద్రబాబునాయుడు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డాడడని ఆమె విమర్శించారు.

స్పీకర్ టిడిపి కార్యకర్తా?

స్పీకర్ టిడిపి కార్యకర్తా?

స్పీకర్ టిడిపి కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని రోజా ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. టిడిపి కార్యకర్తగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు. వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబు అధికారంలో ఉంటే కరువే

చంద్రబాబు అధికారంలో ఉంటే కరువే

చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే కరువే వస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఆమె ప్రస్తావించారు.ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కూడ కరువు పరిస్థితులే నెలకొన్నాయని రోజా గుర్తు చేశారు.కోట్లాది రూపాయాలను ఖర్చు చేసి ఇళ్ళను కట్టుకొన్న చంద్రబాబునాయుడు పేదలకు ఒక్క ఇంటిని కూడ ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పథకాలన్నీ అధికార పార్టీకేనా?

ప్రభుత్వ పథకాలన్నీ అధికార పార్టీకేనా?

ప్రభుత్వ పథకాలన్నీ అధికార పార్టీ కార్యకర్తలకే కేటాయిస్తారా అంటూ ఆమె అధికారులను నిలదీశారు.పుత్తూరులో ఆమె అధికారులతో సమీక్ష నమావేశం నిర్వహించారు.ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళు అధికార పార్టీ నాయకులు సిపారసు చేసిన వారికే ఇస్తారా అంటూ ఆమె కమిషనర్ ను నిలదీశారు.శివాలయంలో కోనేటీ స్థలంలో అధికారపార్టీ నాయకుడు అనధికారికంగా అద్దె వసూలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+