వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే ? సీతమ్మకు తాళి..! హిందూ సంఘాల పైర్..!
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అనూహ్యంగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. నిన్న శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన సీతమ్మ వారికి తాళిబొట్టు కట్టి కలకలం రేపారు. రాములోరి కళ్యాణంలో విరూపాక్షి పాల్గొన్న సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటన నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. దీనిపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.
కర్నూలు జిల్లా ఆలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బుసినే విరూపాక్షి.. నిన్న శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణంలో పాల్గొని సీతమ్మకు తాళి కట్టేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆలూరు నియోజకవర్గంలోని సొంత ఊరు చిప్పగిరిలో జరిగిన రాములోరి కళ్యాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సీతమ్మకు ఎమ్మెల్యే విరుపాక్షి ఎలా తాళి కడతారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

ఎమ్మెల్యే విరూపాక్షి రాములోరి కళ్యాణంలో పాల్గొని సీతమ్మకు తాళికట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో విరూపాక్షి పంతులుగారి సమక్షంలోనే భాజాభజంత్రీల మధ్య ఇలా సీతమ్మకు తాళి కడుతున్నట్లు కనిపించింది. దీంతో అక్కడే ఉన్న వారంతా ఆయన్ను ఎందుకు వారించలేదనే చర్చ జరుగుతోంది. అలాగే ఆయన తాళి కట్టిన తర్వాత అయినా వారు గుర్తించలేదని అర్థమవుతోంది. అక్కడికి వచ్చిన భక్తులు కూడా ఈలలు వేస్తూ ఈ కార్యక్రమంలో సందడి చేసినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనిపై విరూపాక్షి కానీ, వైసీపీ కానీ ఇప్పటిపరకూ స్పందించలేదు.












Click it and Unblock the Notifications