సృజనాత్మకత: బాబు, కిరణ్ రెడ్డి కార్టూన్లు (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు బుధవారం సృజనాత్మకతను ప్రదర్శించారు. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, కె. రామచంద్రా రెడ్డి బాబూరావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కార్టూన్లను ప్రదర్సించారు.

కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం కోసం పోరాటం చేస్తానని చెబుతూ విభజనకు సహకరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మొదటి నుంచి విమర్శలు చేస్తోంది. అలాగే, ప్రతిపక్ష నేత చంద్రబాబు సమైక్యమనే మాట మాట్లాడకుండా విభజనకు సహకరిస్తున్నారని తప్పు పడుతూ వస్తుంది. తమ విమర్సలను ప్రతిబింబించే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం శాసనసభ ఆవరణలో కార్టూన్లను ప్రదర్సించింది.

సమైక్యవాదానికి తూట్లు పొడుస్తున్నట్లు వ్యంగ్యంగా రాసిన వ్యాఖ్యలతో కిరణ్ కుమర్ రెడ్డి, చంద్రబాబు కార్టూన్లను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు బుధవారం శాసనసభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ప్రదర్శించారు.

నేనేంటో చెప్పనని బాబు

నేనేంటో చెప్పనని బాబు

రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ప్రదర్సించిన కార్టూన్ ఇది..

చివరి బంతి వరకూ...

చివరి బంతి వరకూ...

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలను వ్యంగ్యంగా మారుస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ప్రదర్శించిన కార్టూన్ ఇది..

కొడతానన్నేదు కదా...

కొడతానన్నేదు కదా...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, బాబూరావు కార్టూన్లను మీడియా పాయింట్ వద్ద ఇలా ప్రదర్శించారు. లాస్ట్ బంతి వరకు ఉంటానన్నాను గానీ కొడతానన్లేదు కదా.. అని కిరణ్ కుమార్ రెడ్డిపై వ్యంగ్యమైన వ్యాఖ్య

ప్లకార్డుల ప్రదర్శన...

ప్లకార్డుల ప్రదర్శన...

కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులపై కార్టూన్లతో కూడిన ప్లకార్డులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఇలా ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+