వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎమ్మెల్యేల మధ్య జలజగడం: జిల్లా సమీక్షాసమావేశంలో మంత్రి ముందే రచ్చ; అసలేం జరిగిందంటే!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? అనేక జిల్లాలలో నేతల మధ్య సయోధ్య లేదా? ఎవరికి వారుగా ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు వైసీపీని ఇరకాటంలో పడేస్తున్నాయా? జిల్లాలలోనూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత దక్కటం లేదా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

సత్యసాయి జిల్లాలో అభివృద్ధి సలహా మండలి సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేల రచ్చ

సత్యసాయి జిల్లాలో అభివృద్ధి సలహా మండలి సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేల రచ్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీలోనూ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క ప్రతిపక్ష పార్టీతో నిత్యం యుద్ధం చేస్తూనే, మరోపక్క అధికార పక్షం నేతలు కూడా భిన్నాభిప్రాయాలతో గొడవలకు దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లాలో అభివృద్ధి సలహా మండలి సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య రచ్చ కొనసాగింది.

నీటి కేటాయింపుల విషయంలో రాప్తాడు, మడకశిర, పెనుగొండ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం

నీటి కేటాయింపుల విషయంలో రాప్తాడు, మడకశిర, పెనుగొండ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం

సత్యసాయి జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశంలో తమ తమ నియోజకవర్గాలకు నీటి కేటాయింపుల విషయంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరి వాదన వారు వినిపించారు. నీటి కేటాయింపుల విషయంలో ఎవరికి వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. గత ఏడాది ఏ విధంగా నీటి కేటాయింపులు జరిగాయో , ఈ ఏడాది కూడా అదే విధంగా నీటి కేటాయింపులు జరగాలని, పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. ఇక రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన నియోజకవర్గానికి ఆయకట్టు ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరపాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తమ నియోజకవర్గాలకు అన్యాయం చేస్తే ఊరుకోమని అల్టిమేటం

తమ నియోజకవర్గాలకు అన్యాయం చేస్తే ఊరుకోమని అల్టిమేటం

వీరిద్దరి వాదన ఈ విధంగా ఉండగా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాతిపదికన నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్న వాదనకు భిన్నంగా కొత్త వాదన వినిపించారు. నీటి కేటాయింపుల విషయంలో తమ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఊరుకోనని చెప్పారు. ఇలా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యసాయి జిల్లా ఎమ్మెల్యేలు నీటి కేటాయింపుల విషయంలో ఎవరికి వారు గట్టిగానే తమ వాదన వినిపించారు.

 జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశం లో అరగంట పాటు వైసీపీ ఎమ్మెల్యేల రగడ

జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశం లో అరగంట పాటు వైసీపీ ఎమ్మెల్యేల రగడ

దీంతో జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశం లో అరగంట పాటు రాప్తాడు, మడకశిర, పెనుగొండ ఎమ్మెల్యే ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాం ముందే ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. దీంతో మంత్రి గుమ్మనూరు జయరాం జోక్యం చేసుకొని ఎమ్మెల్యేలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. నీటి కేటాయింపు సమస్యను జటిలం చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అందరం కూర్చుని మాట్లాడుకుందామని, సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారం చూద్దామని మంత్రి గుమ్మనూరు జయరాం సూచించారు.

శాంతింపజేసిన మంత్రి జయరాం ... కూర్చుని మాట్లాడుకుందామని విజ్ఞప్తి

శాంతింపజేసిన మంత్రి జయరాం ... కూర్చుని మాట్లాడుకుందామని విజ్ఞప్తి


దీంతో ప్రస్తుతానికి మంత్రి గుమ్మనూరు జయరాం మాట మీద రాప్తాడు, మడకశిర, పెనుగొండ ఎమ్మెల్యేలందరూ శాంతించారు. ఈ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఒకే మాట మీద కి వస్తారా అన్నది ప్రశ్నార్థకమే! మరి సత్య సాయి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలను బయట పెట్టిన జల వివాదం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో వేచి చూడాల్సిందే.

English summary
The fight between YSRCP MLAs continued at the Satyasai district review meeting. Raptadu, Penugonda and Madakashira MLAs have been embroiled in controversy before Minister Jairam over water allocations. The minister intervened and pacified them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X