రఘురామ షాకింగ్-నన్ను జైభీమ్ తరహాలోనే కొట్టారు-అక్కడ సూర్య వచ్చారు-నాకే దిక్కులేదంటూ
వైసీపీ సర్కార్ పై నిత్యం తనదైన శైలిలో విమర్శలు గుప్పించే రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్లో రఘురామ గతంలో రాజద్రోహం కేసులో సీఐడీ కస్టడీలో తనపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా విడుదలైన సూర్య చిత్రం జై భీమ్ లో యువకుడిపై కస్టడీ హింసను గుర్తు చేస్తూ తనను తాను పోల్చుకున్నారు. అక్కడ ఆ యువకుడిని కాపాడేందుకు లాయర్ వచ్చారని, కానీ ఎంపీ అయిన తనకు ఇక్కడ దిక్కులేదన్నారు.

రఘురామ మరో సంచలనం
వైసీపీ సర్కార్ పై నిత్యం ఏదో ఒక అంశం ఆధారంగా విమర్శలు గుప్పించే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరోసారి రెచ్చిపోయారు. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. జనాలకు సైతం ఈ విషయం మరోసారి గుర్తు చేసేందుకు తాజాగా విడుదలైన జై భీమ్ సినిమాను సైతం ఆయన వాడేసుకున్నారు. వైసీపీ సర్కార్ తనపై దాడి చేయించినా ఎంపీనైన తనకు దిక్కులేకుండా పోయిందన్నారు. అదే సమయంలో సీఎం జగన్ కు మరో అంశంలో ఆయన సలహా ఇచ్చేశారు.

వ్యాట్ తగ్గింపుపై సూచన
దేశవ్యాప్తంగా దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రాష్ట్రాల్ని సైతం తమ వంతుగా వ్యాట్ కూడా తగ్గించాలని సూచించింది. కానీ కేంద్రం చేసిన ఈ సూచనను ఏపీ, తెలంగాణ సహా పలు బీజేపీయేతర రాష్ట్రాలు పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు బీజేపీ నేతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై నిత్యం విమర్శలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ సీఎం జగన్ కు ఓ సలహా ఇచ్చేశారు. వ్యాట్ తగ్గింపు వల్ల ఆయనకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చెప్పారు.

జగన్ మంచిపేరు తెచ్చుకోవాలంటే
సీఎం జగన్ మంచిపేరు తెచ్చుకోవాలంటే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సలహా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చమురుపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో వైసీపీ సర్కార్ కూడా వ్యాట్ తగ్గించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం నిర్ణయం స్ఫూర్తితో పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తున్నాయని రఘురామ గుర్తుచేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటల్ని రఘురామ ఇప్పుడు గుర్తు చేశారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు, స్కూలు ఫీజులు, ఇంటి పన్నులు ఎక్కువగా ఉన్నాయని జగన్ చెప్పారని రఘురామ వెల్లడించారు. గతంలో జగన్ చెప్పినట్లు ఇప్పటికీ యానాం, కర్నాటక, ఒడిషా వంటి చోట్ల పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని రఘురామ పేర్కొన్నారు. అప్పట్లో ప్రజల కోసం ధరలు తగ్గించాలని కోరిన జగన్.. ఇప్పుడు అదే అంశాన్ని అమలు చేసేందుకు మాత్రం వెనుకాడుతున్నారని రఘురామ ఆరోపించారు.పెట్రోల్ ధరల తగ్గింపు విషయంలో కర్నాటక సీఎం బొమ్మై గురించి దేశంలో అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారని, అదే కోవలో సీఎం జగన్ కూడా వ్యాట్ తగ్గిస్తే దేశవ్యాప్తంగా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారని రఘురామ చెప్పుకొచ్చారు.

కస్టడీలో తనపై 'జై భీమ్' తరహా టార్చర్
గతంలో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ.. కస్టడీలో తనపై జరిపిన దాడిని రఘురామరాజు గుర్తు చేసుకున్నారు. తాజాగా విడుదలైన హీరో సూర్య మూవీ జై భీమ్ లో కస్టడీ సీన్ ను ఆయన గుర్తు చేశారు. కస్టడీలో గిరిజన యువకుడిపై చోటు చేసుకున్న హింస అచ్చం తన తరహాలోనే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్ధితులు పెద్దగా మారలేదంటూ వ్యాఖ్యానించారు. అక్కడ ఆ యువకుడిని కాపాడేందుకు లాయర్ (హీరో సూర్య) వచ్చారని, కానీ ఎంపీనైన తనకే ఇప్పుడు దిక్కులేకుండా పోయిందన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications