Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి ఆ పని చేస్తున్నారు: ఎంపీ సాయిరెడ్డి విసుర్లు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు (ap politics) ఆసక్తికరంగా మారాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబునాయుడిని అరెస్టు (chandrababu arrest) చేసి ఏపీ సిఐడి అధికారులు జైలుకు పంపించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు కార్యాచరణపై ఆందోళన నెలకొంది.

ఇక తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో నారా భువనేశ్వరి (nara bhuvaneswari), నారా బ్రాహ్మణి (nara brahmani), టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( atchannaidu) ములాఖత్ అయ్యారు. ఈరోజు కోర్టులో జరిగిన వాదనలు, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను చంద్రబాబుకు వారు వివరించారు . ములాఖత్ లో భాగంగా 40 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడారు. ఈ క్రమంలో భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు.

ysrcp mp vijayasai reddy said they are doing paid publicity to get sympathy

దీంతో చంద్రబాబు నాయుడు భువనేశ్వరిని ఓదార్చి, అధైర్య పడవద్దని, నిబ్బరంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు నాయుడు ప్రజల మనిషి అని, 45 ఏళ్ల ఆయన రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఆయనకు ప్రజలే ఊపిరి అని పేర్కొన్న ఆమె, ప్రజల సొమ్ము మాకు అక్కరలేదన్నారు. తాను ఒక కంపెనీ నడుపుతున్నానని, అందులో రెండు శాతం వాటా అమ్ముకున్న తనకు 400 కోట్ల రూపాయలు వస్తాయని భువనేశ్వరి పేర్కొన్నారు.

భువనేశ్వరికి, నారా బ్రాహ్మణి కి టిడిపి శ్రేణుల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. భారీ సంఖ్యలో అభిమానులు భువనేశ్వరిని, బ్రాహ్మణిని కలిసి మద్దతు ప్రకటిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోమారు టిడిపిని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు అంటూ ఆరోపించారు.

ఇది వాళ్లకు కొత్తేం కాదు. డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయి అంటూ సాయి రెడ్డి మండిపడ్డారు. అంతకుముందు ఎన్నికల తర్వాత టీడీపీ ఉండదని వ్యాఖ్యలు చేశారు.

తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు అంటూ పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+