
కుల రాజగురువు: ప్రముఖ పత్రికాధినేతపై విజయసాయి రెడ్డి మామూలుగా కాదు
అమరావతి: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావుపై వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రామోజీ రావును రాము అంటూ గత రెండు రోజులుగా వరుస ట్వీట్లలో దుయ్యబట్టారు. 'వ్యాపార భాగస్వాములు రాము & జగన్నాధరెడ్డి...చైనా & జెకోస్లోవేకియాకు దేశ రహస్యాలు అందించిన దేశద్రోహులు, సీక్రెట్ ఏజెంట్స్, ఇన్ఫార్మర్స్. 1962 నవంబర్లో చైనాతో యుద్దానికి నెల ముందు అక్రమార్జనతో రాము చిట్ ఫండ్ కంపెనీ ప్రారంభించాడు. ఈ రహస్య కోణంఫై దర్యాప్తు జరగాలి' అని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.

‘రాము'కు ఆస్తిపైనే ప్రేమ.. సుమన్ గురించి విజయసాయి రెడ్డి
'రాము రెండో కుమారుడు సుమన్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదనతో మాట్లాడుతూ, "ఎంకి ఎవరని...ఎవరైనా అడిగితే చీకటి వెలుగుల వైపు వేలు చూపిస్తా. ఒంట్లో కాన్సర్ పుడితే గెలవచ్చు. ఇంట్లో తండ్రి కాన్సర్ గా మారితే గెలవలేము. దాని చేతుల్లోనే నేను ఓడిపోయాను' అని చెప్పారని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.రాముకి ఎవరిపైనా ప్రేమ ఉండదు. తనను తాను ప్రేమించుకునే రకం. డబ్బు, కీర్తి, అహంతృప్తి తప్ప మరి దేనిమీద గురిలేదు. కన్నకొడుకైనా, తల్లి, భార్య అయినా తన ఆస్తుల తర్వాతే!' అని వ్యాఖ్యానించారు. ' 'రెండు దశాబ్దాల క్రితం సినిమాల్లో ఒక వెలుగు వెలిగి మరుగునపడ్డ ఆ తరుణుడు జన్మరహస్యం వాడుకుని వదిలేసే స్వార్థపరుడు "రాము'కి తెలుసు. మొదట్లో నువ్వే కావాలన్నావు. ఇప్పుడు వదిలేశావా?' అని ప్రశ్నించారు. 'రాము గురించి అయన రెండవ కుమారుడు సుమన్ అన్న మాటలు విందాం: "బావిలో ఎన్ని నీళ్లు ఉన్నా అవి ఉప్పగా ఉంటే ఎవరికి ఉపయోగం. ఆయన గొప్ప వ్యక్తి కావచ్చు. మంచి తండ్రి కాకపోవచ్చు. కానీ నాకు ఆయనకు కొడుకుగా పుట్టే అర్హత లేదు".' అని పేర్కొన్నారని తెలిపారు.

చంద్రబాబును గద్దెనెక్కించే శకుని మాయోపాయలు: విజయసాయి
10.8.1974 "ఈనాడు" తొలి సంచిక సంపాదకీయంలో ఎబికె ప్రసాద్ గారు రాశారు. "ఇది మీ పత్రిక. ప్రజాశక్తికి మించిన బలం మరొకటి లేదు. ఆ శక్తికి నిష్పాక్షికంగా అక్షరరూపం ఇచ్చి నిలదొక్కుకోవాలని "ఈనాడు" ఆశిస్తోంది". కానీ, ఈరోజు అది ఒక కులపత్రికగా ఒక పార్టీకి కరపత్రంగా మారడం దురదృష్టకరం అని విజయసాయి విమర్శించారు.
ముదిమి మీద పడ్డా పచ్చకుల మీడియా 'రాచపుండు' కీలుబొమ్మ చంద్రబాబును మళ్లీ గద్దెనెక్కించేందుకు శకుని మాయోపాయాలతో ప్రతి అక్షరంలో విషం కలిపి తీపి గుళికల్లా ప్రజలతో తినిపించాలని చూస్తున్నాడు. ఇంటర్నెట్ యుగంలో ఈ రాతలను "ఈనాడు"ఎవరు పట్టించుకుంటారు? వృథా ప్రయాస తప్ప.

రామోజీ డాల్ఫిన్ హోటల్ తవ్వకాల్లో లంకె బిందెలంటూ విజయసాయి
డాల్ఫిన్ హోటల్ నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో దొరికిన లంకె బిందెలు, ఫిరంగులు దేశ సంపద. AP Treasure Trove Act ప్రకారం వాటిని పురావస్తు శాఖకు అప్పగించకుండా స్వాహా చేసి చట్ట ఉల్లంఘనకు, దేశ ద్రోహానికి పాల్పడ్డ రామూ...నువ్వు శిక్షార్హుడివే' అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

కుల రాజగురువు "ఈనాడు" రాము అంటూ సాయి రెడ్డి
యాజమాన్య స్వేచ్చే పత్రికా స్వేచ్ఛ...అనే తప్పుడు సిద్ధాంతంతో తెలుగు పత్రికా రంగంలో విలువలకు తిలోదకాలిచ్చి...కులమే ప్రామాణికంగా, ఏనాడూ "ఈనాడు" పెన్ను పెట్టి అక్షరం రాయని స్వయంప్రకటిత చీఫ్ ఎడిటర్ ఈ దేశంలో ఉన్న ఏకైక వ్యక్తి రామోజీ రావు. పార్టీలు, ప్రభుత్వాలు, పత్రికా సంపాదకుల మధ్య డబ్బు, కులమే ప్రాతిపదికగా లోపాయకారి ఒప్పందాలు కుదరడం1983 నుంచి కుల రాజగురువు "ఈనాడు" రాముతోనే మొదలైంది. ఈ జాడ్యం కలిగిన వాళ్ల పేర్లన్నింటినీ "టెలిగ్రాఫ్" ఆంగ్ల పత్రిక బయటపెట్టింది కూడా. పాఠకులే వీళ్ళకి తగిన బుద్ది చెప్పాలి.

నకిలీ కమ్యూనిస్ట్ రాము"ఈనాడు" ఒక క్రూరుడు అంటూ విజయసాయి
బచావత్ వేజ్ బోర్డు జర్నలిస్టులకు ఖాయపరిచిన జీతభత్యాల అమలుకు ఏళ్ల తరబడి నిరాకరించి...సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరికలతో తీర్పు చెప్పిన తర్వాత కూడా లొసుగులు వెతికి పాత్రికేయుల శ్రమను దోచుకుంటున్న వ్యక్తి ఈనాడు రాము మాత్రమే కనబడతాడు. వేజ్ బోర్డు సిఫార్సులను ఈనాడు రామోజీ తిరస్కరిస్తే ఉద్యోగుల సమ్మెతో 23 రోజులు పత్రిక ప్రచురణ ఆగింది.1991లో సుప్రీంకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా లొసుగులను అడ్డుపెట్టుకొని15 ఏళ్లు కోటి రూపాయలు చెల్లించకుండా వాయిదా వేసిన రాము ఉద్యోగులను దోచుకోవడంలో అందెవేసిన చేయి.
నకిలీ కమ్యూనిస్ట్ రాము"ఈనాడు" ఒక క్రూరుడు. ఉద్యోగులని మనుషుల్లా కాకుండా జంతువులుగా భావిస్తాడు. తార్కిక, సహేతుకమైన విమర్శ కూడా భరించలేడు. తన కులం కాని ఉద్యోగులపై "ఈనాడు" నిఘాపెట్టి తలపై కనిపించని కత్తి వేలాడదీసి వారిని మానసికంగా హింసించే సైకో అంటూ తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి.