విచారణను ఎదుర్కొంటోన్న వేళ- వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై తీవ్ర ఆరోపణలు..!!

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులు వీ విజయసాయి రెడ్డి, రఘురామ కృష్ణంరాజు మధ్య వాగ్వివాదం రోజురోజుకూ ముదురుతోంది. పతాక స్థాయికి చేరుకుంటోంది. ఒకరినొకరు ఘాటు విమర్శలను సంధించుకుంటోన్నారు. తీవ్ర ఆరోపణలను గుప్పించుకుంటోన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను వేదికగా చేసుకుని ఇద్దరూ ఓ మినీ యుద్ధమే సాగిస్తోన్నారు.

తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు పొందిన రఘురామ కృష్ణంరాజు.. ఢిల్లీలో విలేరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సాయిరెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు- టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు శాసన సభ్యుల కొనుగోలు కేసుకు సంబంధించిన విచారణలో ఉన్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సారథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక బృందం నుంచి నోటీసులను కూడా అందుకున్నారు.

YSRCP MP Vijayasai Reddy slams Partys rebel MP Raghu Rama Krishnam Raju allegedly Havala racket

ఈ నెల 29వ తేదీన ఉదయం 10:20 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి రఘురామ విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణ సందర్భంగా తెలంగాణ సిట్ అధికారులకు తాను సహకరిస్తాననీ రఘురామ చెబుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య తాజాగా విజయసాయి రెడ్డి ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజు హవాలా బ్రోకర్ అవతారం ఎత్తాడంటూ ఆరోపించారు.

బ్యాంకులను మోసగించిన కేసులో విచారణను ఎదుర్కొనకుండా తప్పించుకుని తిరుగుతోన్నాడంటూ విమర్శించారు. బ్యాంకులను లూటీ చేశాడని, ఆ డబ్బుతో బినామీ అవతారం ఎత్తాడనీ ధ్వజమెత్తారు. బినామీ పేర్లతో బ్యాంకులను మోసగించిన నగదును దాచి పెట్టుకున్నాడని, అందులో నుంచి 100 కోట్ల రూపాయలను అరెంజ్ చేశాడని విమర్శించారు సాయిరెడ్డి.

YSRCP MP Vijayasai Reddy slams Partys rebel MP Raghu Rama Krishnam Raju allegedly Havala racket

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయనకు రాజకీయ గురువుగా భావిస్తోన్న మీడియా అధినేత రామెజీ రావు ఈ హవాలా వెనుక ఉన్నారని ఆరోపించారు విజయసాయి రెడ్డి చెప్పారు. వారిద్దరి సలహా మేరకే 100 కోట్ల రూపాయలు సిద్ధం చేశాడని మండిపడ్డారు.

స్ట్రిప్ డాన్సర్లతో కుప్పిగంతులు, పెగ్గుతత్వాన్ని బోధించేవాడి రఘురామ కృష్ణంరాజుకు రాజకీయాలు ఎందుకని విరుచుకుపడ్డారు. పదవిని కాపాడుకోవడానికి రఘురామ కృష్ణంరాజు బ్రోకర్, బ్రోతల్ పనులు కూడా చేస్తోన్నాడంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఇలా ఎంతమందికి భజన చేస్తావు?.. ఎన్ని పార్టీలను దేబిరిస్తావు అంటూ నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+