చంద్రబాబు పర్యటన దృష్ట్యా కడప ఎంపి అవినాష్ రెడ్డి హౌజ్ అరెస్ట్

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప జిల్లా పర్యటనను పురస్కరించుకొని కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని ముందు జాగ్రత్తగా పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.

కడప :ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప జిల్లా పర్యటనను పురస్కరించుకొని కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని ముందు జాగ్రత్తగా పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుదవారం నాడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే కడప ఎంపి అవినాష్ రెడ్డిని పోలీసులు ముందు జాగ్రత్తగా హౌజ్ అరెస్టు చేశారు.

ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకుగాను ఎంపిని హౌజ్ అరెస్టుచేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. పైడిపాలెం రిజర్వాయర్ పనులను 90 శాతం వైఎస్ఆర్ పూర్తి చేశారని , అయితే ప్రాజెక్టులన్నింటిని తానే పూర్తిచేసినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటున్నారని ఎంపి అవినాష్ రెడ్డి విమర్శించారు.

ysrcp mp ys avinash reddy house arrested

తనను నిర్భంధించడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని ఆయన చెప్పారు.జన్మభూమిలో సమస్యలు చెప్పుకోవాలని ప్రభుత్వం సూచిస్తోందని, తమ సమస్యలు చెప్పుకొవడానికి రాకుండా అరెస్టు చేయడం సరైంది కాదని ఆయన ప్రశ్నించారు.

గండికోట లో సిఎం పర్యటన దృస్ట్యా మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీని పోలీసులు మంగళవారం నుండి గృహ నిర్భంధంలోనే ఉంచారు. కొన్ని రోజులుగా గండికోట ముంపు వాసులకు పరిహరం విషయంలో జయశ్రీ పోరాటం నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+