YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్‌లో ఊహించని ట్విస్ట్
కొన్ని నెంబర్లు కొంతమందికి అస్సలు అ కలిసిరావు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని '11' సీట్ల దగ్గరే ఆపేసిన ఓటరు దేవుడు, ఇప్పుడు పార్లమెంట్ గడపలోనూ అదే నెంబర్‌తో పలకరించడంతో ఆ పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. పార్లమెంట్ భవనంలో తమకు కేటాయించిన రూమ్ నెంబర్ చూసి షాక్ తిన్న వైసీపీ ఎంపీలు.. అది తమకు అరిష్టమంటూ గగ్గోలు పెట్టడం ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పార్లమెంట్ పాత భవనం నుంచి పార్టీ కార్యాలయాలను కొత్త భవనానికి మారుస్తున్న క్రమంలో, స్పీకర్ ఓం బిర్లా వైసీపీకి మొదటి అంతస్తులోని 11వ నెంబర్ గదిని కేటాయించారు. అయితే, ఆ నెంబర్ చూడగానే ఎంపీలకు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గుర్తొచ్చాయట. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఆ చేదు జ్ఞాపకం, ఇప్పుడు ఢిల్లీలోనూ వెంటాడుతుండటంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "మాకు ఆ నెంబర్ వద్దు.. వెంటనే మార్చండి" అంటూ స్పీకర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

నైన్ (9) వర్సెస్ ఎలెవన్ (11)
ఒకవైపు తెలుగుదేశం పార్టీకి అదే ఫ్లోర్‌లో 9వ నెంబర్ గదిని కేటాయించారు. టీడీపీకి మంచి నెంబర్ ఇచ్చి, తమకు మాత్రం ఓటమికి గుర్తుగా ఉన్న 11ను కేటాయించడంపై వైసీపీ ఎంపీలు లోలోపల మదనపడ్డారు. స్పీకర్‌ను కలిసి విన్నవించుకోవడంతో, ఎట్టకేలకు ఆయన కనికరించి 11వ నెంబర్‌ను రద్దు చేసి, 12వ నెంబర్ గదిని కేటాయించారు. దీంతో వైసీపీ నేతలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
ట్రోలర్లకు పండగే పండగ!
ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో ట్రోలర్లు రెచ్చిపోతున్నారు. "అక్కడ 11.. ఇక్కడ 11.. వైసీపీని ఆ నెంబర్ వదలడం లేదుగా!" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ముందు జాగ్రత్తగా 11ను మార్పించుకున్నారు సరే.. మరి జనం గుండెల్లో ముద్ర పడిపోయిన ఆ 11ను ఎలా మారుస్తారు?" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా, రాజకీయాల్లో సెంటిమెంట్లు ఏ స్థాయిలో ఉంటాయో ఈ 'రూమ్ నెంబర్' ఎపిసోడ్ మరోసారి నిరూపించింది.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications