వాలంటీర్ల తొలగింపులో భాగమే-వాట్సాప్ గ్రూప్ ఆదేశాలపై వైసీపీ ఫైర్..!
ఏపీలో వాలంటీర్ల భవిష్యత్తు నానాటికీ అగమ్య గోచరంగా మారుతోంది. ఎన్నికల సమయంలో వారికి జీతాలు రెట్టింపు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన కూటమి పార్టీలు.. ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే ఆ హామీల్ని విస్మరించాయి. అంతే కాదు వారు గతంలో క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్ని తొలగించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే రెండు నెలలుగా వారిని కొనసాగిస్తూనే విధులు అప్పగించకుండా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ప్రభుత్వం తాజా ఆదేశాలు వారిలో ఆందోళన మరింత పెంచాయి.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై విపక్ష వైసీపీ మండిపడింది. వాలంటీర్ల వాట్సాప్ గ్రూపుల నుంచి ఆ క్లస్టర్ లో ఉన్న 50 కుటుంబాలను తొలగించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. ఇందులో వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశారంటూ విమర్శించింది.

వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన @ncbn.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడు.
— YSR Congress Party (@YSRCParty) August 5, 2024
వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్‌లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాలు
చంద్రబాబు తేనె పూసిన కత్తికి… pic.twitter.com/16asihjkF1
అలాగే వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్‌లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాల ఇచ్చారని వైసీపీ ఆరోపించింది. చంద్రబాబు తేనె పూసిన కత్తికి బలైపోయి రోడ్డున పడిన లక్షలాది మంది వాలంటీర్లు అంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల కాపీని ఈ ట్వీట్ కు జత చేసింది. ఇప్పటికే వైసీపీ అనుకూల వాలంటీర్లను కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వారికి షాక్ ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications