వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు డ్యూటీ గుర్తు చేసిన రఘురామకృష్ణంరాజు- ఆ మీటింగ్‌ పెట్టాలని లేఖ

|
Google Oneindia TeluguNews

వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనా నిత్యం విమర్శలు చేస్తున్న రెబెల్‌ నేత రఘురామకృష్ణంరాజు ఇవాళ పార్టీ అధినేత, సీఎం జగన్‌కు ఓ లేఖ రాశారు. ఎప్పటిలా కాకుండా ఆయన ఈసారి వినమ్రంగా అధినేత జగన్‌కు తన బాధ్యతను గుర్తు చేశారు. విమర్శల జోలికి పోకుండా రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ సమావేశం నిర్వహించాలని ఆయన తన లేఖలో జగన్‌ను కోరారు.

<strong>డోస్ పెంచుతున్నా స్పందించని వైసీపీ- కరుణించని బీజేపీ.. రఘురామ ఒంటరి పోరు.</strong>.డోస్ పెంచుతున్నా స్పందించని వైసీపీ- కరుణించని బీజేపీ.. రఘురామ ఒంటరి పోరు..

సాధారణంగా పార్లమెంటు సమావేశాలకు ముందు వివిధ పార్టీల అధినేతలు ఆయా పార్టీలకు చెందిన ఎంపీలతో భేటీ నిర్వహిస్తుంటారు. ఇందులో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తారు. రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన సమస్యలపై ఎంపీలకు పార్టీ అధినేతలు బ్రీఫ్‌ చేస్తుంటారు. కానీ ఈసారి పార్లమెంటు సమావేశాలకు ఐదురోజులే మిగిలున్నా ఇప్పటివరకూ జగన్‌ ఎంపీల సమావేశం నిర్వహించకపోవడాన్ని రఘురామ గుర్తుచేశారు. అనవాయితీ ప్రకారం ఎంపీల భేటీ నిర్వహించాలని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించాలని జగన్‌ను ఆయన కోరారు.

ysrcp rebel mp raghurama raju request jagan for all party mps meet ahead of parl sessions

ఈసారి విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను కూడా ఆహ్వానించాలని, ఈ సమావేశాన్ని వర్చువల్‌ భేటీగా నిర్వహించాలని రఘురామ తన లేఖలో జగన్‌ను కోరారు. రాష్ట్రానికి చెందిన చాలా సమస్యలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ఎంపీలు పనిచేసేలా జగన్‌ దిశానిర్దేశం చేయాలని రఘురామ కోరారు.

English summary
ysrcp rebel mp raghurama raju wrote a letter to cm jagan and request to convene all party mps meet ahead of upcoming parliament sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X