ఏపీలో జే బ్రాండ్ రచ్చ-కౌంటర్ గా చంద్రబాబు హయాం బ్రాండ్లు బయటపెట్టిన వైసీపీ
ఏపీలో జే బ్రాండ్ మద్యంపేరుతో రచ్చ కొనసాగుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమల్లోకి వచ్చిన మద్యం బ్రాండ్లపై ఇప్పటికే పలు ఆరోపణలు చేస్తున్న విపక్ష టీడీపీ.. తాజాగా జంగారెడ్డి గూడెం కల్తీ సారా ఘటన తర్వాత జే బ్రాండ్ పేరుతో విమర్శలకు దిగుతోంది. దీంతో అధికార పార్టీ వైసీపీ ఇరుకునపడుతోంది. దీంతో టీడీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు ఇవాళ చంద్రబాబు హయాం నాటి మద్యం బ్రాండ్ల పేర్లు, ఫొటోల్ని వైసీపీ విడుదల చేసింది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్లో అమ్మిన కొన్ని బ్రాండ్ల పేర్లను వాటి ఫొటోలతో సహా ఇవాళ వైసీపీ నేతలు విడుదల చేశారు. ప్రెసిడెంట్ మెడల్ - గవర్నర్స్ రిజర్వ్- బూమ్ బీరు" ఇవన్నీ చంద్రబాబు-టీడీపీ ప్రభుత్వం తెచ్చినవే.. ఇవిగో సాక్ష్యాలు...అంటూ మద్యం బాటిళ్ల ఫొటోల్ని, వాటిని ఎప్పటి నుంచి అమలు చేశారనే వివరాల్ని కూడా వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసింది.దీంతో వీటిపై చర్చ మొదలైంది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటివరకూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రఫభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. అప్పటివరకూ ఏటా నిర్వహించే మద్యం షాపుల వేలాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా షాపుల్లో సిబ్బందిని నియమించి మరీ అమ్మకాలు సాగిస్తోంది. ఇందులోనూ గతంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బ్రాండ్లకు బదులుగా నాసిరకం మద్యం బ్రాండ్లు దర్శనమిస్తుండటంతో వాటిని తాగలేక జనం ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో శానిటైజర్లు తాగి మరీ ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు కూడా. దీంతో కొన్ని నెలల క్రితం ప్రభుత్వం గతంలో అమ్మిన పలు బ్రాండ్లను తిరిగి అందుబాటులోకి తెచ్చింది.














Click it and Unblock the Notifications