వరద చర్యల్లో వైఫల్యం-నాదెండ్లకు బాబు క్లాస్-వైసీపీ షాకింగ్ వీడియో ట్వీట్..!

ఏపీలో విజయవాడను కుదిపేసిన భారీ వరదలను ఎదుర్కునే విషయంలో అధికార కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇవాళ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సైతం విడుదల చేసింది. ఎక్స్ లో పోస్టు చేసిన ఈ వీడియోలో సీఎం చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అలాగే చంద్రబాబు వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలపై జనసేన మంత్రి మనోహర్ పై సీరియస్ అవుతున్నారు.

విజయవాడ వరద బాధితులకు ఆహారం అందించడంలో తీవ్ర వైఫల్యం అంటూ వైసీపీ ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది.
మంత్రి నాదెండ్ల మనోహర్‌ని అందరి ముందు చులకన చేసి మాట్లాడిన చంద్రబాబు అంటూ ఈ వీడియోను చూపిస్తూ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరి మధ్య కాసేపు హాట్‌హాట్‌గా మాటల యుద్ధం జరిగిందని చెప్పింది. సీఎం, మంత్రుల కుమ్ములాటలు తో బాధితులకు తప్పని ఆకలి రాత్రులు, చంద్రబాబు వద్దే సరుకులు అందలేదని చెప్పిన వరద బాధితులు,, భారీ పబ్లిసిటీ చేసి సరుకులు అందించని ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించింది.

ysrcp releases sensational video on Chandrababu-nadendla Manohar conversation on floods failure

మంత్రి నారాయణ అడ్డుపడ్డారనేలా సాకులు చెప్పిన నాదెండ్లపై చంద్రబాబు రుసరుసలు అంటూ ఈ వీడియోలో వైసీపీ వ్యాఖ్యలు చేసింది. వరద బాధితులకి సహాయం చేయడంలో మీవల్లే ప్రభుత్వంకి చెడ్డపేరు వచ్చేసిందని చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారని పేర్కొంది. పబ్లిసిటీ ప్లాన్ బెడిసికొట్టడంతో జనసేన పార్టీపైకి నెపం నెట్టేసే కుట్ర చేస్తున్న చంద్రబాబు అంటూ విమర్శించింది. సీఎం, మంత్రులు, అధికారులు సమన్వయ లోపంతో వరద బాధితులకు కష్టాలంటూ వైసీపీ ఈ వ్యాఖ్యల్ని ముగించంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+