Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిరాయింపులకు కౌంటర్: సాక్షి మీడియానే జగన్ అస్త్రం

విజయవాడ: సాక్షి మీడియాను అస్త్రంగా ప్రయోగిస్తూ తమ పార్టీ శాసనసభ్యుల ఫిరాయింపులకు బ్రేక్ వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహం పన్నినట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ మారిన శాసనసభ్యుల బాగోతాల గుట్టు విప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ వ్యూహంలో మొదటి విడతగా అమరావతి భూబాగోతాలను, చంద్రబాబు బినామీలను వేలెత్తి చూపుతూ బుధవారం సాక్షి దినపత్రికలో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఇటువంటి కథనాలనే వరుసగా ఇస్తూ పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలకి గుబులు పుట్టించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, తమ పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

 YSRCP says it will expose the deals of Naidu and defector MLAs

టీడీపీలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఫిరాయింపుదారులేనని అన్నారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రభావం ఉండదని, ప్రభుత్వంపై తమ పోరాటం తీవ్రత తగ్గదని స్పష్టం చేశారు.

నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు. శాసనసభలో ఫిరాయింపుదారులపై తేల్చుకుంటామని అన్నారు.

చంద్రబాబునాయుడు తను సంపాదించిన అవినీతితోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొంటున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. తెలంగాణలో చంద్రబాబు పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడని అన్నారు. తెలంగాణలో జరిగిన అవమానాన్ని మర్చిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పని చేస్తున్నారని మండిపడ్డారు.

ఫిరాయింపుల చట్ట ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే విశ్వనీయత గురించి చంద్రబాబు మాట్లాడుతుండటం హాస్యాస్పదమని అన్నారు.

టీడీపీ ప్రభుత్వం అవినీతి బాగోతాలను బయటపెడతామని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబునాయుడు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+