ఏపీలో సాక్షి టీవీ నిలిపివేత: చైనా యూనివర్సిటీలో నిరసనలు
బీజింగ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన ఘటన పైన ఏపీలో ఆందోళనలు జరుగుతున్నాయి. హైదరాబాదులో కూడా సాక్షి జర్నలిస్టులు రోడ్డెక్కారు. సాక్షి టీవీని నిలిపి వేయడం పైన వైసీపి నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా, సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై చైనాలో కూడా నిరసనలు చేపట్టడం గమనార్హం. ఇందుకు సంబంధించి సాక్షిలో వార్త వచ్చింది. చైనాలో గల లయోనింగ్ రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. జిన్ ఝౌ మెడికల్ వర్సిటీ విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో నిరసన తెలిపారు.

ఈ నిరసన చైనా వైయస్సార్ కాంగ్రెస్ మెడికల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక వైసిపి స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు కొనకళ్ల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... టిడిపి ప్రభుత్వం తమ అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు, చంద్రబాబు అడ్డగోలుగా ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి సాక్షి టీవి ప్రసారాలను నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు 'సాక్షి' షాక్: హైద్రాబాద్‌లో రోడ్డెక్కారు (పిక్చర్స్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన ఘటన పైన ఏపీలో ఆందోళనలు జరుగుతున్నాయి. హైదరాబాదులో కూడా సాక్షి జర్నలిస్టులు రోడ్డెక్కారు. సాక్షి టీవీని నిలిపి వేయడం పైన వైసీపి నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై చైనాలో కూడా నిరసనలు చేపట్టడం గమనార్హం. చైనాలో గల లయోనింగ్ రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications