Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ మండలిలో ఈ ఏడాది 23ఖాళీలు-వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ ?టీడీపీ నామమాత్రం-బీజేపీ అవుట్ ?

ఈ ఏడాది ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీ బలం మరింత పెరగబోతోంది. ఇంకా చెప్పాలంటే మండలిని దాదాపు క్లీన్ స్వీప్ చేసే స్ధాయిలో ఆ బలం పెరగబోతోంది. ఈ ఏడాది చోటు చేసుకోబోయే పరిణామాలే ఇందుకు కారణం. ఈ దెబ్బతో అసెంబ్లీ తరహాలోనే మండలిలోనూ వైసీపీ పూర్తి స్దాయిలో ఏకపక్షంగా రాజకీయాలు చేసేందుకు వీలు కలగబోతోంది. ఇందుకు దారి తీయబోతున్న పరిణామాల్ని ఓసారి చూద్దాం..

ఏపీ శాసనమండలిలో వైసీపీ

ఏపీ శాసనమండలిలో వైసీపీ

ఏపీలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి కేవలం 9 సీట్లు మాత్రమే ఉండేవి. ఈ దశలో మూడు రాజధానుల ప్రక్రియను తెరపైకి తెచ్చిన జగన్ కు మండలి కొరకరాని కొయ్యగా మారింది. అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా జగన్ కు మండలి భారీ ఝలక్ ఇచ్చింది. అయితే అధికారుల సాయంతో ఈ బిల్లుల్ని గవర్నర్ కు పంపగలిగిన వైసీపీ సర్కార్.. అక్కడా నెగ్గించుకుంది. కానీ మండలి ఇచ్చిన ఝలక్.. జగన్ ను నిద్రపోనివ్వలేదు. దీంతో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కేంద్రం దాన్ని ఆమోదించడానికి ముందే మండలిలో వైసీపీ బలం మూడు రెట్లయింది. దీంతోపాటే మండలి రద్దు ప్రతిపాదనా తెరమరుగైంది.

ప్రస్తుతం మండలిలో వైసీపీ

ప్రస్తుతం మండలిలో వైసీపీ

ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో వైసీపీకి 32 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. ఇందులో ఎమ్మెల్యేల కోటాలో 14 మంది, స్ధానిక సంస్ధల కోటాలో 11 మంది, పట్టభద్రుల కోటాలో ఒకరు, గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వారు మరో ఆరుగురు వైసీపీ సభ్యులు ఉన్నారు. అలాగే టీచర్ల కోటాలో ఇండిపెండెండ్ గా పోటీచేసిన కల్పలతా రెడ్డిని వైసీపీ గెలిపించుకోవడంతో ఆ సీటు కూడా వైసీపీ ఖాతాలో ఉన్నట్లే. దీంతో వైసీపీ బలం 32కు చేరుకుంది. ఇది ఈ ఏడాది భారీగా పెరగబోతోంది.

ఈ ఏడాది 23 రిటైర్మెంట్లు

ఈ ఏడాది 23 రిటైర్మెంట్లు

ఈ ఏడాది మండలిలో 23 మంది సభ్యులు రిటైర్ కాబోతున్నారు. వీరు మూడు విడతలుగా రిటైర్ కాబోతున్నారు. వీరంతా వివిధ కోటాల్లో మండలికి సభ్యులుగా ఎన్నికైన వారే. ఇందులో ఈ ఏడాది మార్చి 29 నాటికి 14 మంది, మే 1 నాటికి ఏడుగురు, జూలై 20 నాటికి మరో ఇద్దరు రిటైర్ కాబోతున్నారు. అలాగే ఇందులో ఎమ్మెల్యే కోటాలో ఎంపికైన వారు మార్చి 29న ఏడుగురు, మే 1న ఇద్దరు, జూలై 20న మరో ఏడుగురు రిటైర్ అవుతారు. అలాగే స్ధానిక సంస్ధల కోటాలో మే 29న ఇద్దరు, మే 1న ఏడుగురు రిటైర్ అవుతున్నారు. మే 29న ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, టీచర్ల కోటా నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు రిటైర్ అవుతారు. అలాగే జూలై 20న గవర్నర్ కోటా నుంచి ఎంపికైన ఇద్దరు రిటైర్ అవుతారు.

కోటాల వారీగా ఎమ్మెల్సీ రిటైర్మెంట్లు

కోటాల వారీగా ఎమ్మెల్సీ రిటైర్మెంట్లు

ఎమ్మెల్యేల కోటాలో ఎంపికైన గంగుల ప్రభాకర్ రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, పీవీవీ సూర్యనారాయణరాజు, పోతుల సునీత, నారా లోకేష్, బచ్చుల అర్జునుడు రిటైర్ అవుతున్నారు. స్ధానిక సంస్ధల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, దీపక్ రెడ్డి రిటైర్ మార్చి 29న అవుతున్నారు. అలాగే మే 1న ఇదే కోటాలో ఎంపికైన టీడీపీ ఎమ్మెల్సీలు బీఎన్ రాజసింహులు, అంగర రామమోహన్, ఎంవీ సత్యనారాయణ రాజు, చిక్కాల రామచంద్రరావు, శత్రుచర్ల విజయరామరాజు, కేఈ ప్రభాకర్, బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కూడా రిటైర్ అవుతారు. అలాగే పట్టభద్రుల నుండి మార్చి 29న చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, అనంతపురం, కడప, కర్నూలు నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ నుంచి ఎంపికైన బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా రిటైర్ అవుతారు.

అలాగే ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీలు అయిన వారిలో మార్చి 29న చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి రిటైర్ అవుతారు. అలాగే జూలై 20న గవర్నర్ కోటాలో ఎంపికైన టీడీపీ ఎమ్మెల్సీలు చడిపిరాళ్ళ.శివనాథరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ కూడా రిటైర్ అవుతారు.

వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ ?

వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ ?

ఇలా రిటైర్ అవుతున్న స్ధానాల్లో వైసీపీకి ఉన్న సిట్టింగ్ స్దానాల్లో ఎమ్మెల్యేల కోటాలో ఐదు సీట్లు తిరిగి వస్తాయి. అలాగే టీడీపీకి ఉన్న రెండు సీట్లు వైసీపీ ఖాతాలో చేరతాయి. అలాగే స్ధానిక సంస్ధల కోటాలో 8 టీడీపీ సీట్లు, ఓ బీజేపీ సీటు కూడా వైసీపీ ఖాతాలోకి కొత్తగా వస్తాయి. అలాగే పట్టభద్రుల నియోజకవర్గాల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ రిటైర్ అవుతున్నందున ఆ స్ధానం కూడా తిరిగి గెల్చుకునే అవకాశముంది. దీంతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ స్దానం కూడా వైసీపీకి దక్కడం ఖాయం. అలాగే గవర్నర్ కోటాలో ఇద్దరు టీడీపీ సభ్యుల స్ధానంలో వైసీపీ ఎమ్మెల్సీలు రావడం ఖాయం. టీచర్ల అసంతృప్తి నేపథ్యంలో రెండు సీట్లు రాకపోయినా మొత్తం మీద వైసీపీ బలం 46కు చేరబోతోంది. దీంతో మండలిలో మొత్తం 58 ఎమ్మెల్సీల్లో 46 వైసీపీ వారే ఉంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+