బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

sadist: ఏదో అనుకున్నాడు, ఏదో జరిగిపోయింది, దెబ్బకు రెండు కేసులు, ఇంకోసారి ఎవ్వరూ చేసినా?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో దారుణం జరిగింది. మొబైల్ లో మాట్లాడుకుంటూ స్కూటర్ నడిపిన యువకుడు కారును ఢీకొట్టాడు. తరువాత కారులో ఉన్న 71 ఏళ్ల వ్యక్తి కిందకు దిగి స్కూటర్ లో వెలుతున్న వ్యక్తిని ప్రశ్నించాడు,. ఆ సందర్బంలో కారులో ఉన్న వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించిన యువకుడి స్కూటర్ ను వెనుక నుంచి పట్టుకున్నాడు.

కిరాతకుడు ముసలివాడు అని కూడా చూడకుండా బెంగళూరులోని రోడ్ల మీద ఆ వ్యక్తిని అర్ద కిలోమీటర్ దూరం ఈడ్చుకుంటూ స్కూటర్ లో పారిపోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే బెంగళూరు పోలీసుల దెబ్బకు నిందితుడికి సినిమా కనపడింది. ఐటీ హబ్ పోలీసులు నిందితుడి మీద రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చెయ్యడంతో కిరాతకుడికి సినిమా కనపడింది.

Wife: కొత్త పెళ్లికూతుర్ని చంపిన హార్డ్ వేర్ ఇంజనీర్, ఆ బిడ్డకు తండ్రి నేనా, అక్క మొగుడా ?, విమానంలో జంప్!Wife: కొత్త పెళ్లికూతుర్ని చంపిన హార్డ్ వేర్ ఇంజనీర్, ఆ బిడ్డకు తండ్రి నేనా, అక్క మొగుడా ?, విమానంలో జంప్!

బెంళూరు నగరంలో నివాసం ఉంటున్న ముత్తప్ప (71) అనే వ్యక్తికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముసలివాడిని నడిరోడ్డు మీద స్కూటర్ తో లాక్కెళ్లిన సాహిల్ (25) అనే కిరాతకుడిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు అతని మీద రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముత్తప్ప మీడియాలో మాట్లాడారు.

విజయపురకు చెందిన మా కుటుంబం 50 ఏళ్ల క్రితం బెంగళూరు వచ్చి స్థిరపడ్డామని ముత్తప్ప చెప్పారు, తనకు ఒ కొడుకు కూడా ఉన్నాడని ముత్తప్ప వివరించారు. మంగళవారం తాను బోలేరో కారులో చంద్రాలేఔట్ లోని కువెంపు బాషా ప్రాధికార కార్యాలయానికి బయలుదేరానని, మార్గం మధ్యలో వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్డులోని ఎస్ బీఐ బ్యాంక్ సర్కిల్ సమీపంలో సాహిల్ మొబైల్ లో మాట్లాడుకుంటూ స్కూటర్ వేగంగా నడిపి తన కారును డీకొట్టాడని ముత్తప్ప మీడియాకు చెప్పారు.

Super police: నాటీకోళ్లను అరెస్టు చేసి సెల్ లో పెట్టిన సూపర్ పోలీస్, వీళ్లకు గోల్డ్ మెడల్ ఇచ్చేయండి!Super police: నాటీకోళ్లను అరెస్టు చేసి సెల్ లో పెట్టిన సూపర్ పోలీస్, వీళ్లకు గోల్డ్ మెడల్ ఇచ్చేయండి!

ఎందుకు ఢీకొట్టావని సాహిల్ ను ప్రశ్నిస్తే నా తప్పు ఏమీలేదని సాహిల్ తనతో గొడవ చేశాడని, తరువాత స్కూటర్ తో పాటు అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడని ముత్తప్ప అన్నారు. సాహిల్ పారిపోకుండా అతన్ని పట్టుకోవాలని అతన్ని స్కూటర్ వెనుక పట్టుకున్నానని, అయినా సాహిల్ స్కూటర్ ఆపకుండా సుమారు అర్దకిలోమీటర్ వరకు తనను ఈడ్డుకుని వెళ్లాడని, స్థానికులు సాహిల్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారని ముత్తప్ప వివరించారు.

A sadist who dragged a 71-year-old man for half a kilometer with a scooter in Bengaluru city

ఈ సంఘటనలో తన శరీరంలోని వెన్ను ఎముక, చేతికి, కాళ్లకు గాయాలైనాయని ముత్తప్ప విచారం వ్యక్తం చేశారు. బెంగళూరులోని గోవిందరాజ నగర పోలీసులు సాహిల్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో విజయనగర ట్రాఫిక్ పోలీసులు సాహిల్ మీద కేసు నమోదు చేశారు. ముసలివాడిని నడిరోడ్డు మీద ఈడ్చుకుని వెళ్లిన సాహిల్ ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అందరి ముందు మొబైల్ చూస్తూ కాలక్షేపం చెయ్యడంతో ప్రజలు మండిపడుతున్నారు.

సాహిల్ మీద విజయనగర ట్రాఫిక్ పోలీసులు, గోవిందరాజనర పోలీసులు వేర్వేరుగా రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చెయ్యడంతో అతనికి దేవుడు సరైన శిక్ష వేస్తాడని ప్రజలు అంటున్నారు. ఇంత జరిగినా, సెల్ లో ఉన్నా సాహిల్ మాత్రం కొంచెం కూడా విచారం వ్యక్తం చెయ్యలేదని, తప్పు జరిగిందని చెప్పడం లేదని పోలీసులు అంటున్నారు.

English summary
A sadist who dragged a 71-year-old man for half a kilometer with a scooter in Bengaluru city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X