ఏం స్కెచ్ వేశావురా ?, ఏం చేశారు ?, దెబ్బకు ప్లాన్ ఒకే కానీ ?, రేపు చిక్కితే ఏం చేస్తారో చూడాలి!
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు సిటీలో సీసీబీ పోలీసుల ముసుగులో నలుగురు నిందితులు రోడ్డు మీద ఓ వ్యాపారిని నిలువు దోపిడీ చేసి రూ.10 లక్షలతో పరారయ్యారు. కాటన్ పేట పోలీస్ రోడ్డులో నివాసముంటున్న మూలారామ్ (37) అనే వ్యక్తి దారిదోపిడీకి గురైనాడు. రాత్రి మైసూరు రోడ్డులోని సిర్సీ రౌండ్ అబౌట్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
చోరీకి గురైన ములారామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వల వేశారు.ఉత్తర భారతదేశానికి చెందిన మూలారామ్ చాలా ఏళ్లుగా కుటుంబంతో కలిసి బెంగళూరు నగరంలోనే నివాసం ఉంటున్నాడు. మనవర్టుపేటలో మెట్రో షూ ఏజెన్సీ పేరుతో ఓ షోరూమ్ ప్రారంభించాడు.
మూలారామ్ సొంత ఊరు సమీపంలోని పట్టణానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి బెంగళూరు నగరంలో బట్టల వ్యాపారం ఉంది. దీనికి తోడు రమేష్ తెలిసిన వ్యాపారులకు వ్యాపారం చేసేందుకు వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడు. రమేష్ వడ్డీకి ఇచ్చిన డబ్బులను వసూలు చేస్తున్న మూలారామ్ ప్రతినిత్యం వసూలు చేసిన డబ్బు మూలారామ్ కు తిరిగి ఇచ్చేవాడు.

రాత్రి రమేష్ అతని అనుచరుడు మూలారామ్ కు ఫోన్ చేసి కొందరు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని సూచించాడు. దీంతో మూలారామ్ కొందరు వ్యాపారుల నుంచి మొత్తం 10 లక్షలు వసూలు చేసి రమేష్‌కు అందజేయడానికి డబ్బును బ్యాగ్‌లో పెట్టుకుని బైక్ లో బయలుదేరాడు. మార్గం మధ్యలో మైసూరు రోడ్డులోని సిర్సి సర్కిల్ సమీపంలోకి వెళ్తున్నాడు. ద్విచక్ర వాహనంలో వెనుక నుంచి వచ్చిన నలుగురు అగంతకులు, మేము సీసీబీ పోలీసులు అని చెప్పి మూలారామ్ బైక్ ను అడ్డుకున్నారు.
మూలారామ్ బ్యాగ్ లో ఉన్న డబ్బు లాక్కొన్నారు. మరో ఇద్దరు దుండగులు మూలారమ్ మెడ మీద, చేతుల మీద దాడి చేశారు. అంతే కాకుండా మూలారామ్ చేతులను బ్లేడుతో కోసి నలుగురు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. మూలారామ్ కేసు పెట్టడంతో పోలీసుల పేరు చెప్పి నిలువు దోపిడీలు చేస్తున్న నిందితుల కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications