Actress: నటి తల్లికి సీరియస్, హ్యాండ్ ఇచ్చిన ఫ్రెండ్స్, రూ. లక్షల బిల్లు కట్టిన టాప్ హీరో, వైరల్!

బెంగళూరు: తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే సహాయం చేస్తామని చెప్పిన స్నేహితులు, బంధువులు అందరూ చేతులు ఎత్తేయడంతో ఆ నటి తల్లడిల్లిపోయింది. కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ పెట్టడంతో షూటింగ్ లు ఆగిపోవడం, డబ్బులు లేకపోవడంతో ఆ నటి సతమతం అయ్యింది. ఆసుపత్రిలో బిల్లు కడితేకాని వైద్యం చెయ్యలేని పరిస్థితి ఎదురైయ్యింది. ఇప్పటికే ఆసుపత్రి బిల్లు కొన్ని లక్షల రూపాయలు అయ్యింది.

బిగ్ బాస్ షో తో పరిచయం అయిన టాప్ హీరోను ఆ నటి సహాయం చెయ్యాలని వేడుకుంది. అంతే ఆ టాప్ హీరో ఆసుపత్రి బిల్లుతో పాటు మందులకు అయ్యే ఖర్చులు మొత్తం చెల్లించాడు. నా తల్లి ప్రాణం కాపాడిన ఆ హీరో నాకు దేవుడితో సమానం, నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను అంటూ ఆ నటి బోరున విలపిస్తూ విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది.

బిగ్ బాస్ షో ఫేమ్

బిగ్ బాస్ షో ఫేమ్

కన్నడ బుల్లి తెర నటి సోనూ పాటిల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. బుల్లితెర నటిగా సోనూ పాటిల్ చాలా మంది అభిమానులనే సంపాధించుకుంది. కన్నడ బిగ్ బాస్ సీజన్- 2తో సోనూ పాటిల్ కొన్ని లక్షల మందికి దగ్గర అయ్యింది. బుల్లితెర నటిగా సోనూ పాటిల్ కు కన్నడ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉందనే చెప్పాలి.

తల్లికి అనారోగ్యం

తల్లికి అనారోగ్యం

నటి సోనూ పాటిల్ తల్లి మహాదేవి పాటిల్ అనారోగ్యానికి గురైనారు. కర్ణాటకలోని బాగల్ కోటే లోని శకుంతల ఆసుపత్రిలో తల్లి మహాదేవిని చేర్పించిన నటి సోనూ పాటిల్ ఆమెకు వైద్యం చేయించింది. చేతిలో ఉన్న డబ్బుు మొత్తం ఖాలీ అయిపోవడంతో ఆర్థిక సహాయం చెయ్యాలని నటి సోనూ పాటిల్ తెలిసిన స్నేహితులు, బంధువులను వేడుకునింది.

రూ. లక్షలు ఖర్చు.... హ్యాండ్ ఇచ్చిన ఫ్రెండ్స్

రూ. లక్షలు ఖర్చు.... హ్యాండ్ ఇచ్చిన ఫ్రెండ్స్

నటి సోనూ పాటిల్ తల్లి మహాదేవికి న్యూమోనియా వ్యాధితో పాటు అధిక రక్తపోటు, షుగర్ తదితర వ్యాధులతో అనారోగ్యం క్షీణించింది. లక్షల రూపాయలు ఖర్చు అవుతోందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో నటి సోనూ పాటిల్ తల్లడిల్లిపోయింది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సహాయం చెయ్యడానికి ఒక్కరూ ముందుకు రాకపోవడంతో సోనూ పాటిల్ ఆవేదన చెందింది.

టాప్ హీరోకు ఫోన్

టాప్ హీరోకు ఫోన్

కన్నడ బిగ్ బాస్ షోను కన్నడ ప్రముఖ హీరో, బహుబాష నటుడు, ఎస్ఎస్. రాజమౌలి దర్శకత్వం వహించిన ఈగ సినిమా ఫేమ్ సుదీప్ నిర్వహిస్తున్నాడు.తనకు ఆర్థిక సహాయం చెయ్యాలని, తన తల్లి ప్రాణాలు కాపాడాలని, నువ్వు తప్పా తనకు తెలిసిన వాళ్లు ఎవ్వరూ లేరని నటి సోనూ పాటిల్ హీరో సుదీప్ కు ఫోన్ చేసి వేడుకుంది.

స్వతహగానే తనను నమ్మున్నవాళ్లకు, అభిమానులకు సహాయం చెయ్యడానికి సిద్దంగా ఉన్న హీరో సుదీప్ కూడా సోనూ పాటిల్ తల్లి విషయం తెలుసుకుని చలించిపోయాడు.

రూ. 5 లక్షలు బిల్

రూ. 5 లక్షలు బిల్

సుదీప్ చారిటబుల్ ట్రస్ట్ తరపున నటి సోనూ పాటిల్ తల్లి మహాదేవి ఆసుపత్రి బిల్లుతో పాటు ఆమెకు అవసరం అయిన మందులు మొత్తం హీరో సుదీప్ తీసిచ్చాడు. తన తల్లి ఆసుపత్రి బిల్లు రూ. 5 లక్షలు అయ్యింది. తన తల్లి ప్రాణాలు కాపాడిన హీరో సుదీప్ నిజజీవితంలో కూడా హీరోనే, ఆయన రుణం ఈ జన్మలో మరిచిపోలేని, సుదీప్ అన్నా, నువ్వు నా తల్లి ప్రాణం కాపాడావు, ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి చెప్పు అంటూ నటి సోనూ పాటిల్ బోరన విలపిస్తున్న ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నిజజీవితంలో సుదీప్ హీరో..... నో డౌట్

నిజజీవితంలో సుదీప్ హీరో..... నో డౌట్

కరోనా కాలంలో ఆసుపత్రిలో బెడ్ దోరకడం కష్టం అవుతోందని, బెడ్ దొరికినా తన తల్లికి చికిత్స చేయించడానికి తన దగ్గర డబ్బులు లేదని, అలాంటి సమయంలో సుదీప్ తనను ఆదుకున్నాడని నటి సోనూ పాటిల్ ఓ వీడియో విడుదల చేసింది. మొత్తం మీద మరోసారి హీరో సుదీప్ సాటి నటి తల్లి ప్రాణం కాపాడి మరోసారి అభిమానుల్లో చెరగని ముద్రు వేసుకున్నారని స్యాండిల్ వుడ్ వర్గాలు అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+