ముళ్లును మళ్లుతోనే తియ్యాలి, మోదీ రోడ్ షోలో భజరంగి ప్రత్యక్షం, దెబ్బకు దెబ్బ!

బెంగళూరు: మేము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంతో కర్ణాటకలోని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అప్పటి నుంచి ప్రతి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ జైభజరంగ బలి అంటూ ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నారు.

బెంగళూరులో శనివారం జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో భజరంగిలు ప్రత్యక్షం అయ్యారు. హనుమంతుడి వేషదారణలతో అనేక మంది కళాకారులు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో పాల్గొంటున్నారు. శనివారం ఉదయం భజరంగి వేషదారణలతో అనేక మంది కళాకారులు రోడ్ల మీదకు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Bajrangi artists at Prime Minister Narendra Modis road show in Bengaluru

ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి అనే సామెతలాగా కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ నాయకులు భజరంగి వేషదారుల కళాకారులను రంగంలోకి దింపారు. తన రోడ్ షోలో భజరంగి వేషదారణలతో ఉన్న కళాకారులు పాల్గొంటున్నారని తెలుసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారని బీజేపీ నాయకులు అంటున్నారు.

శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ప్రారంభం అయ్యే కోణెణకుంటే, జేపీ నగర్, మారేనహళ్లి, జయనగర 5వ బ్లాక్, జయనగర్ 4 బ్లాక్, మాదవన్ పార్క్, జయనగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు బారులు తీరడంతో బీజేపీ నాయకులు ఫుల్ ఖుషీ అయిపోయారు.

ప్రధాని మోదీ హవాతో కచ్చితంగా ఎమ్మెల్యేలు అయిపోవాలని బెంగళూరులోని పలు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు బావిస్తున్నారు. కర్ణాటక సంస్కృతిని ప్రతిబింభించేలా కర్ణాటకలోని అన్ని ప్రాంతాల నుంచి వివిద రంగాలకు చెందిన కళాకారులను బెంగళూరు రప్పించిన బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో పూర్తిగా పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో విజయవంతం చెయ్యడానికి బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+