Bengaluru: కూతురి లవ్ మ్యారేజ్ తో పొలిటికల్ లీడర్ దంపతుల ఆత్మహత్య, ఊరు మొత్తం షాక్!

బెంగళూరు/రామనగర: రాజకీయాల్లో ఉంటూ ఊరిలో ఎవరికైనా సమస్యలు వస్తే పరిష్కరిస్తున్న వ్యక్తి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆయన్ను గ్రామపంచాయితీ ఎన్నికల్లో వరుసగా గెలిపిస్తున్నారు. ఆయన పేరు చెబితో ఒక్కరు కూడా ఆయన్ను విమర్శించడానికి మనసురాదు. అలాంటి వ్యక్తి కుమార్తె ఇటీవల ఇంటి నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకునింది.

ఊరిలో ఏ సమస్య వచ్చినా తన దగ్గరకే వస్తారని, ఇప్పుడు తాను ఎలా తల ఎత్తుకుని బయట తిరగాలని ఆ పోలిటికల్ లీడర్ ఆవేదన చెందాడు. సొంత ఫామ్ హౌస్ లోని తోటలోకి వెళ్లిన పోలిటికల్ లీడర్ భార్యతో కలిసి మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 ఊరి పెద్ద...... వివాదాలకు దూరం

ఊరి పెద్ద...... వివాదాలకు దూరం

బెంగళూరు సమీపంలోని రామనగర జిల్లాలోని చెన్నపట్టణ సమీపంలోని తంకేనహళ్ళిలో రమేష్ (50), శైలజా (42) దంపతులు నివాసం ఉంటుటన్నారు. రమేష్, శైలజా దంపతులకు శిల్పా అనే కుమార్తె ఉంది. సొంత ఊరిలో రమేష్ కు చాలా పేరుప్రతిష్టలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉంటున్న రమేష్ ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు.

పొలిటికల్ లీడర్

పొలిటికల్ లీడర్

వివాదాలకు దూరంగా ఉంటున్న రమేష్ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనే ముందు నిలబడి వారి సమస్యలు పరిష్కరిస్తున్నాడు. ఊరిలో ఎవరైనా గొడవ పడినా ముందుగా అందరూ రమేష్ దగ్గరకు వెళ్లి న్యాయం చెప్పాలని మనవి చేస్తారు. ఎవ్వరికి అన్యాయం చెయ్యకుండా ఊరి పెద్ద రమేష్ పంచాయితీలు చేస్తున్నాడు. రమేష్ మంచితనం చూసిన ఊరి ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఆయన్ను గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వరుసగా గెలిపిస్తూ వస్తున్నారు.

కూతురి లవ్ మ్యారేజ్ తో షాక్

కూతురి లవ్ మ్యారేజ్ తో షాక్

రమేష్, శైలజా దంపతుల కుమార్తె శిల్పా ఆమె స్నేహితుడు పునీత్ ను ప్రేమించింది. శిల్పా ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లి శైలజా కూతురిని మందలించింది. మీ నాన్నకు ఊరిలో ఇంత మంచి పేరు ఉందని, నువ్వు ప్రేమ పెళ్లి అంటూ బయటతిరిగే మీ నాన్న పరువు పోతుందని తల్లి శైలజా కుమార్తె శిల్పాకు బుద్దిమాటలు చెప్పింది. అయితే తల్లిదండ్రులను ఎదిరించిన శిల్పా ఆమె ప్రియుడు పునీత్ తో పారిపోయి పెళ్లి చేసుకునింది.

పోలిటికల్ డీడర్ దంపతుల ఆత్మహత్య

పోలిటికల్ డీడర్ దంపతుల ఆత్మహత్య

కూతురు శిల్పా పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో అవమానంతో బయట తిరగలేక రమేష్ కొన్ని రోజులు ఇంటికే పరిమితం అయ్యాడు. తాను ఇక ముందు గ్రామ పెద్దగా ఉండలేని ఆవేదన చెందిన రమేష్ అతని భార్య శైలాజను పిలుచుకుని వెళ్లి సొంత తోటలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు చెయ్యడానికి ప్రయత్నించారు.

ఊరిలో ఒక్కరు కూడా వ్యతిరేకంగా లేరు

ఊరిలో ఒక్కరు కూడా వ్యతిరేకంగా లేరు

విషయం బయటకు రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రమేష్ కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చెన్నపట్టణ పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకుని రమేష్, శైలజా మృతదేహాలను పోస్టుమార్టుం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఊరిలో ఒక్కరంటే ఒక్కరు రమేష్ కుటుంబ సభ్యులను ఒక్కమాట కూడా అనేవాళ్లు కాదని, అంత మంచి వ్యక్తి చివరికి కూతురు విషయంలో ఆయన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+