బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: దెబ్బకు ఢమాల్, ఎన్నోఏళ్ల తరువాత ఐటీ హబ్ లో, మీ కాళ్లు పట్టుకుంటాము, ఇటువైపు రావద్దు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో మొదలైన చిరుజల్లులు రానురాను గాలివానలా తయారై భారీ వర్షాలు పడటంతో నగర ప్రజలకు చుక్కలు కనపడుతున్నాయి. ఎన్నో సంవత్సరాల తరువాత వాన దేవుడు బెంగళూరు ప్రజలకు సినిమా చూపించాడు. బెంగళూరు నగరంలో గత 10 ఏళ్లలో మరోసారి వాన దేవుడు చూపించిన ప్రతాపానికి ప్రజలకు 70 ఎంఎం సినిమా కనపడుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రింగ్ రోడ్డులో సంచరించే ప్రయాణికులకు రింగరింగా అంటూ ట్రాఫిక్ జామ్ సౌండ్ హారన్స్ వినపడుతున్నాయి. రింగ్ రోడ్డులోని ఐటీ కంపెనీ ఉద్యోగులు చేస్తున్న కొందరు అయితే సహనం కోల్పోతున్నారు. కొందరు ఐటీ కంపెనీ ఉద్యోగులకు గతంలో ఉండే బీపీ, షుగర్స్ లెవల్స్ పెరిగిపోయి వారి కిందస్థాయి ఉద్యోగుల మీద, ఇంట్లో పెళ్లాలు, పిల్లల మీద చిందుల వేస్తున్నారు. రింగ్ రోడ్డు ప్రాంతాలు స్విమ్మింగ్ పూల్స్ లా దర్శనం ఇవ్వడంతో దయచేసి ఇటువైపు ప్రయాణించడానికి ఎవ్వరూ రావద్దండి మహాప్రభో అంటూ బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు.

Model: నా మొగుడు దుబాయ్ లో ఉన్నాడు, వస్తే స్వర్గం చూపిస్తా, వస్తావా ?, ఎగరేసుకుంటూ వెళ్లిన వ్యాపారవేత్త!Model: నా మొగుడు దుబాయ్ లో ఉన్నాడు, వస్తే స్వర్గం చూపిస్తా, వస్తావా ?, ఎగరేసుకుంటూ వెళ్లిన వ్యాపారవేత్త!

బెంగళూరులో 10 ఏళ్లలో మరోసారి !

బెంగళూరులో 10 ఏళ్లలో మరోసారి !

ఎన్నో సంవత్సరాల తరువాత వాన దేవుడు బెంగళూరు ప్రజలకు సినిమా చూపించాడు. బెంగళూరు నగరంలో గత 10 ఏళ్లలో మరోసారి వాన దేవుడు చూపించిన ప్రతాపానికి ప్రజలకు 70 ఎంఎం సినిమా కనపడుతోంది. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో మొదలైన చిరుజల్లులు రానురాను గాలివానలా తయారై భారీ వర్షాలు పడటంతో నగర ప్రజలకు చుక్కలు కనపడుతున్నాయి.

ఐటీ కంపెనీలు ఇక్కడే ఎక్కువ

ఐటీ కంపెనీలు ఇక్కడే ఎక్కువ


బెంగళూరు నగరంలోని మారతహళ్లి- సిల్క్ బోర్డు, సిల్క్ బోర్డు- ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ పీఎల్ తో పాటు రింగ్ లో విపరీతంగా వందల సంఖ్యలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. బెంగళూరు నగరంలోని రింగ్ రోడ్డులో విపరీతంగా వర్షం నీరు చేరిపోవడంతో కార్లు, ఇతర వాహనాలు అర్దం మునిగిపోయి దర్శనం ఇచ్చాయి. ఇక బైక్ ల్లో సంచరించే వాళ్లు అయితే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది.

 బీపీలు, షుగర్ లెవల్స్ పెరిగిపోయి ?

బీపీలు, షుగర్ లెవల్స్ పెరిగిపోయి ?

బెంగళూరు సిటీలోని మారతహళ్లి- సిల్క్ బోర్డు జంక్షన్ మద్యలోని రింగ్ రోడ్డులోని ఐటీ కంపెనీ ఉద్యోగులు చేస్తున్న కొందరు అయితే సహనం కోల్పోతున్నారు. కొందరు ఐటీ కంపెనీ ఉద్యోగులకు గతంలో ఉండే బీపీ, షుగర్స్ లెవల్స్ పెరిగిపోయి వారి కిందస్థాయి ఉద్యోగుల మీద, ఇంట్లో పెళ్లాలు, పిల్లల మీద చిందుల వేస్తున్నారు.

 దండం పెట్టి వేడుకుంటున్న ట్రాఫిక్ పోలీసు అధికారులు

దండం పెట్టి వేడుకుంటున్న ట్రాఫిక్ పోలీసు అధికారులు

రింగ్ రోడ్డు ప్రాంతాలు స్విమ్మింగ్ పూల్స్ లా దర్శనం ఇవ్వడంతో దయచేసి ఇటువైపు ప్రయాణించడానికి ఎవ్వరూ రావద్దండి మహాప్రభో అంటూ బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. మొత్తం మీద బెంగళూరు నగరంలో 2014 తరువాత ఇప్పుడు మరోసారి 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో బెంగళూరు ప్రజలు బిత్తరపోయారు.

English summary
Bengaluru: Heavy rains lashed Bengaluru on Sunday resulting in flooding and inundation in many parts of the city. The city observatory recorded 83 mm of rain On Sunday,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X