బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru riots: డ్రగ్స్ కేసులో పోలీసులు బిజీ, బంధువుల ఇంట్లో బిర్యానీకి వచ్చిన ముజాహిద్, ఖర్మ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కేజీఎఫ్: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో అల్లర్లు జరగడానికి, ఎమ్మెల్యే ఇంటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ద్వంసం కావడాకి కారణం అయిన ప్రధాన నిందితుడు, కింగ్ పిన్ ముజాహిద్ అనే వ్యక్తిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకాలం ఇతర ప్రాంతాల్లో తప్పించుకుని తిరుగుతున్న వాటర్ మన్, బ్యాట్స్ మన్, ఫైర్ మన్ అవతారాలు ఎత్తిన ముజాహిద్ పోలీసులకు సినిమా పక్కీలో చిక్కిపోయాడు.

డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ బ్యూటీల కేసుల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బిజీగా ఉన్నారని, తనను ఎవ్వరూ ఏమి చెయ్యలేరని పప్పులో కాలేసిన ముజాహిద్ బంధువల ఇంటికి వెళ్లి బిర్యానీ తింటున్న సమయంలో హ్యాండ్సప్ అంటూ పోలీసులు అతనికి ఊహించని షాక్ ఇచ్చారు.

SSR Case: బైకుల్లాలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, సుశాంత్ మిస్, నేడు ఇంద్ర+రాణి= ఇంద్రాణి ఫ్రెండ్?!SSR Case: బైకుల్లాలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, సుశాంత్ మిస్, నేడు ఇంద్ర+రాణి= ఇంద్రాణి ఫ్రెండ్?!

కరోనా కాలంలో పోయేకాలం

కరోనా కాలంలో పోయేకాలం

సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలోని డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో ఆగస్టు 11వ తేదీ అర్దరాత్రి పులకేశీనగర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి నిప్పంటించారు. అదే సమయంలో డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో అంబులెన్స్ లు, పోలీసు వాహనాలు, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలతో పాటు అనేక మంది ఆస్తులు నాశనం చేశారు. కరోనా కాలంలో కొందరు అల్లరిమూకలకు పోయాలం కావడంతో పెద్ద ఎత్తున హింస చలరేగింది.

ఒక్క ఫేస్ బుక్ పోస్టుతో రామాయణం

ఒక్క ఫేస్ బుక్ పోస్టుతో రామాయణం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ఓ వర్గం దేవుడిని కించపరిచారిచి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడని ఆరోపిస్తూ ఆగస్టు 11వ తేదీ అర్దరాత్రి బెంగళూరులో అల్లర్లు జరిగాయి. కరోనా కాలంలో బెంగళూరు అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్రచర్చకు దారితీసింది. అల్లర్లు అరికట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయి అనేక మందికి గాయాలైనాయి.

వాటర్ మన్ కాదు... బ్యాట్స్ మన్.... ఫైర్ మన్

వాటర్ మన్ కాదు... బ్యాట్స్ మన్.... ఫైర్ మన్

డీజే హళ్ళి ప్రాంతంలో ముజాహిద్ వాటర్ మన్ గా పని చేస్తున్నాడు. అయితే ఓ వర్గంలోని స్థానికులను ఒక్కటి చేసి ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటి దగ్గరకు పిలుచుకుని వెళ్లి ఆయన ఇంటికి నిప్పంటించిన ఫైర్ మన్ గా ముజాహిద్ కింగ్ పిన్ అయ్యాడని పోలీసులు అంటున్నారు. ఆ రోజు డీజే హళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర నానా హంగామా జరిగిన సమయంలో ముజాహిద్ అక్కడే ఉన్నాడని పోలీసులకు సాక్షాలు చిక్కాయి.

ఎమ్మెల్యే అఖండ అనుమానం అదే

ఎమ్మెల్యే అఖండ అనుమానం అదే

స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వర్గం వారిని ముజాహిద్ రెచ్చగొట్టి ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి నిప్పంటించాడని పోలీసులు అంటున్నారు. తన ఇల్లు నాశనం కావడానికి ముజాహిద్ ప్రధాన కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సైతం పోలీసు అధికారుల ముందు ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు సుమారు 150 మందిని అరెస్టు చెయ్యడంతో ముజాహిద్ పరారైనాడు.

డ్రగ్స్ కేసులో పోలీసులు బిజీగా ఉన్నారని !

డ్రగ్స్ కేసులో పోలీసులు బిజీగా ఉన్నారని !

ఆగస్టు 11వ తేదీ బెంగళూరులో అల్లర్లు జరిగిన తరువాత ముజాహిద్ పరారైనాడు. తరువాత బెంగళూరు గ్రామీణ, కోలారు. చిక్కబళ్లాపుర, కేజీఎఫ్, ముళబాగిల్, రామనగరలోని బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ముజాహిద్ తలదాచుకున్నాడు. అప్పటి నుంచి ముజాహిద్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బిజీబిజీగా ఉన్నారని, తనను పట్టుకునే ఓపిక వాళ్లకు లేదని ముజాహిద్ పొరపాటుపడ్డాడు.

Recommended Video

YS Jagan కుమార్తె Harsha Reddy ఘనత, Bengaluru వెళ్తున్న జగన్ దంపతులు
బంధువుల ఇంట్లో బిర్యానీలు

బంధువుల ఇంట్లో బిర్యానీలు

బెంగళూరు చేరుకున్న ముజాహిద్ చామరాజపేటలోని బంధువుల ఇంటిలో హ్యాపీగా బిర్యానీ తింటున్న సమయంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. హ్యాండ్సప్ అంటూ పోలీసులు సినిమా స్టైల్లో అతన్ని చుట్టుముట్టడంతో అంత వరకు తిన్న బిర్యానీ ముజాహిద్ కడుపులో నుంచి బయటకు వచ్చినట్లు అయ్యింది. మొత్తం మీద బెంగళూరులో అల్లర్లు వ్యాపించడానికి కారణం అయిన ముజాహిద్ ఊహించని విధంగా పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.

English summary
Bengaluru riots: CCB police arrested Mujahid in connection with riots in the DJ Halli and KG Halli police stations limits in Bengaluru. He is the main accused in the case if set fire to MLA Akhanda Srinivas Murthy house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X