బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: కర్ణాటకలో అడుగుపెడితో 7 రోజులు క్వారంటైన్, పక్క రాష్ట్రం ప్రజలకు, విద్యార్థులకు షాక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కొచ్చి: కేరళలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తాండవం చెయ్యడంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. కేరళ దెబ్బతో ఆ రాష్ట్రం సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు హడలిపోతున్నాయి. కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు వెలుతున్న మలయాళీలు, పర్యాటకుల మీద పక్క రాష్ట్రాలు ఆంక్షలు విదిస్తున్నాయి. ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కర్ణాటకలోకి పొరుగు రాస్ట్రం నుంచి వచ్చేవాళ్లు ఎవ్వరైనా సరే కచ్చితంగా 7 రోజులు క్వారంటైన్ లో ఉండాలని కర్ణాటక మఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులు కూడా కచ్చితంగా 7 రోజులు క్వారంటైన్ లో ఉన్న తరువాత వారికి పరీక్షలు నిర్వహిస్తామని కర్ణాటక కోవిడ్ వార్ రూమ్ ఇన్ చార్జ్, సీనియర్ మంత్రి ఆర్. అశోక్ అన్నారు. క్వారంటైన్ లో ఉన్న వారు తరువాత ఆర్ టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకుని కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకున్న తరువాత బయటకు వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో నైట్ కర్ణ్యూ కనసాగించాలని, శుభకార్యాలు, వివాహనాలకు హాల్ లో 50 శాతం మంచి ఉండకూడదని కోవిడ్ నిర్వహణ సమావేశంలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.

Khiladi wife: ముగ్గురు మొగుళ్లు, కన్నింగ్ లవర్ తమ్ముడికే వలవేసి, రూ. 45 లక్షలు. మూడో మొగుడు!Khiladi wife: ముగ్గురు మొగుళ్లు, కన్నింగ్ లవర్ తమ్ముడికే వలవేసి, రూ. 45 లక్షలు. మూడో మొగుడు!

కేరళ దెబ్బతో కర్ణాటక హడల్

కేరళ దెబ్బతో కర్ణాటక హడల్


కేరళలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తాండవం చెయ్యడంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. కేరళ దెబ్బతో ఆ రాష్ట్రం సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు హడలిపోతున్నాయి. కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు వెలుతున్న మలయాళీలు, పర్యాటకుల మీద పక్క రాష్ట్రాలు ఆంక్షలు విదిస్తున్నాయి. ఇప్పుడు కేరళ నుంచి వచ్చే వారి మీద పక్క రాష్ట్రం కర్ణాటకలో అంక్షలు మొదలైనాయి.

7 రోజులు కచ్చితంగా క్వారంటైన్

7 రోజులు కచ్చితంగా క్వారంటైన్

కర్ణాటకలోకి పొరుగు రాస్ట్రం నుంచి వచ్చేవాళ్లు ఎవ్వరైనా సరే కచ్చితంగా 7 రోజులు క్వారంటైన్ లో ఉండాలని కర్ణాటక మఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. సోమవారం బెంగళూరులో కోవిడ్ నిర్వహణ విభాగం ఇన్ చార్జ్ మంత్రులు, అధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో కేరళ నుంచి వచ్చే వారు ఎవ్వరైనా సరే వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి వారికి కరోనా నెగిటివ్ అని వెలుగు చూసిన తరువాత వారు బయట తిరగడానికి అవకాశం ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది.

 విద్యార్థులకు పరీక్షలు.... నైట్ కర్ఫ్యూ కొనసాగింపు

విద్యార్థులకు పరీక్షలు.... నైట్ కర్ఫ్యూ కొనసాగింపు

విద్యార్థులు కూడా కచ్చితంగా 7 రోజులు క్వారంటైన్ లో ఉన్న తరువాత వారికి పరీక్షలు నిర్వహిస్తామని కర్ణాటక కోవిడ్ వార్ రూమ్ ఇన్ చార్జ్, సీనియర్ మంత్రి ఆర్. అశోక్ అన్నారు. కేరళ సరిహద్దుల్లోని కర్ణాటకలోని జిల్లాలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. కేరళ సరిహద్దులోని దక్షిణ కన్నడ, కొడుగు జిల్లాలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని, ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

50 శాతంతో శుభకార్యాలకు అనుమతి

50 శాతంతో శుభకార్యాలకు అనుమతి

వివాహాలు, శుభకార్యాలు చేసుకునే వారు కల్యాణ మండపాలు కానీ, ఫంక్షన్ హాల్స్ కాని 50 శాతం నిండకుండా జరుపుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెళ్లిళ్లకు 400 మందికి మించి హాజరుకాకూడదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కేరళ నుంచి వచ్చే వారికి వారం రోజుల పాటు క్వారంటైన్ కచ్చితంగా అమలు చేస్తామని చెబుతున్న కర్ణాటక ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి కర్ణాటకలో అడుగు పెట్టే వారికి కూడా ఆ నియమాలు జారీ చెయ్యాలని ఆలోచిస్తోందని తెలిసింది.

Recommended Video

Basavaraj Bommai: All You Need To Know About Karnataka CM | Oneindia Telugu
కొంపలు మునుగకుండా ముందు జాగ్రత్తలు

కొంపలు మునుగకుండా ముందు జాగ్రత్తలు

కర్ణాటక సరిహద్దులోని కేరళ, మహారాష్ట్రలో విపరీతంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సమయంలో ముందు జాగ్రతగా అక్కడి నుంచి వచ్చే పర్యాటకులు, ప్రయాణికుల మీద నిఘా వెయ్యాలని, అరకంగా కర్ణాటకలో కోవిడ్ పాజిటివ్ కేసులకు కళ్లెం వెయ్యాలని అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నది. మొత్తం మీద కేరళ దెబ్బతో పొరుగున ఉన్న కర్ణాటక ప్రజలు, అక్కడి ప్రభుత్వం హడలిపోతున్నది.

English summary
Bengaluru: Those who coming from kerala to karnataka now a institutional quarantine mandatory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X