ఫ్యామిలీ ప్యాకేజ్ లో బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్లు, వినడానికే విడ్డూరంగా ఉంది, దళపతి పంచ్!
బెంగళూరు/న్యూఢిలీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒక పార్టీ భాగోతం మరో పార్టీ బయట పెట్టడం మొదలుపెట్టింది. ఇంతకాలం జేడీఎస్ అంటే కుటుంబ రాజకీయాల పార్టీ అని ఆరోపణలు చేసిన బీజేపీకి దళపతి ఫ్యామిలీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇంకో సారి దేవేగౌడ జేడీఎస్ పార్టీని ఫ్యామిలీ పార్టీ అని మాట్లాడకుండా జేడీఎస్ పంచ్ పడింది.
బీజేపీలో ఫ్యామిలీ ప్యాకేజ్ లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేశారని, ఇది వినడానికే విడ్డూరంగా ఉందని జేడీఎస్ మండిపడింది. ఎవరెవరు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు అనే లిస్ట్ ను జేడీఎస్ గురువారం బయటపెట్టింది. జేడీఎస్ పార్టీ దళపతి, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఫ్యామిలీని ఇంతకాలం టార్గెట్ చేస్తూ మాట్లాడిన బీజేపీ నాయకుల నోటికి తాళం వేశారు.

బీజేపీ నాయకులను టార్గెట్ చెయ్యాలని జేడీఎస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న వారి లిస్ట్, వారి రాజకీయ నేపథ్యం మొత్తం జేడీఎస్ పార్టీ బయటపెట్టింది. కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ కూడా కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని జేడీఎస్ ఆరోపించింది.
బీజేపీలోని ఉంటూ కుటుంబ రాజకీయాలు చేస్తున్న వారి జాబితాను జేడీఎస్ పార్టీ విడుదల చేసింది.
* కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ స్వయంగా కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన తండ్రి కర్ణాటక మాజీ సీఎం అని గుర్తు చేశారు.
* మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్రకు శికారీపుర టిక్కెట్ ఇచ్చారు. యడియూరప్ప మరో కుమారుడు బీజేపీ ఎంపీ.
* బళ్లారి రెడ్డి బ్రదర్స్ ఇద్దరికి బీజేపీ నాయకులు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు.
* మంత్రి శ్రీరాములు, ఆయన మేనల్లుడు సురేష్ బాబుకు, శ్రీరాములు చిన్నానకు బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది.
* ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య సోదరుడి కుమారుడు బెంగళూరు తేజస్వి సూర్య బెంగళూరు సౌత్ ఎంపీ అని జేడీఎస్ గుర్తు చేసింది.
* బెళగావి జారకిహోళి బ్రదర్స్ కు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది.
* ఉమేష్ కత్తి, ఆయన సోదరుడి కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు.
* బీజేపీ ఎంపీ అన్నాసాహెబ్ భార్య శశికలా జోల్లాకు గతంలో మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
*. మాజీ సీఎం బంగారప్ప కుమారుడు కుమార బంగారప్పకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
* ఎంపీ ఉమేష్ జాధవ్ కుమారుడు అవినాష్ జాదవ్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
* మాజీ ఎంపీ కుమారుడు ప్రీతమ్ నాగప్పకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
* మాజీ మంత్రి కుమారుడు దత్తాత్రేయ పాటిల్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
* మాజీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
* మాజీ మంత్రి కుమారుడు సప్తగిరి గౌడకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు,
* ఎమ్మెల్సీ కుమారుడు చంద్రకాంత్ పాటిల్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
* మంత్రి ఆనంద్ సింగ్ కుమారుడు సిద్దార్థ్ సింగ్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
* మాజీ మంత్రి ఏ. క్రిష్ణప్ప కుమార్తె పూర్ణిమా శ్రీనివాస్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
* మాజీ ఎమ్మెల్యే అమ్రత్ దేశాయ్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
ఇంత మంది రాజకీయ వారసులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన బీజేపీ నాయకులు ఇప్పుడు మాకు నీతి పాఠాలు చెబుతున్నారని, వినడానికే విడ్డూరంగా ఉందని జేడీఎస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల మీద మండిపడుతోంది.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications