స్టాలిన్ తో స్నేహం కోసం ఇక్కడ సర్వనాశనం చేస్తున్నారు, ఏమిటి సార్ ఈ లాజిక్ లు!

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు చెందిన పలుకుబడి ఉన్న నేతలంతా ఏకమై కావేరీ నీటికి సంబందించిన మేకేదాటు ప్రాజెక్టు కోసం పాదయాత్రలు చేశారు. అయితే ఇప్పుడు తమిళనాడుకు ఎందుకు నీటిని విడుదల చేశారని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సీటీ రవి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మంగళవారం మండ్యలో బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేకేదాటు ప్రాజెక్టు కోసం డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకులు కలిసి పాదయాత్రలు చేశారన్నారు. కానీ డీకే శివకుమార్ తమిళనాడుకు ముందుగానే నీటిని విడుదల చేసి కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాని సీటీ రవి ఆరోపించారు.

BJP leader CT Ravi accuses Karnataka government of releasing Cauvery water for friendship with TN CM Stalin

కావేరీ కర్ణాటక గర్వించ దగ్గ విషయం మాత్రమే కాదు, మన జీవ స్వాస, మండ్య, మైసూర్‌లోని రైతుల జీవితాలను మెరుగుపరిచింది కావేవరి నీరు, బెంగళూరు ప్రజల దాహం తీర్చుతున్నదని ఇదే కావేరి నీరు అని సీటీ రవి అన్నారు. కావేరీ లేకుండా బెంగళూరు మనుగడ సాగించదు. కావేరి వివాదం ఈరోజు నిన్నటిది కాదు. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో కావేరీ నదీ జలాలను కాపాడాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉందని సీటీ రవి అన్నారు.

రైతులంతా ఒక్కటే, కర్ణాటక, తమిళనాడు అనే తేడా లేదు. కానీ సమస్య ఉన్నప్పుడు, నీటి పంపిణి ఫార్ములా ప్రకారం వ్యవహరించాలి. ఇప్పుడు కర్ణాటకలో వర్షాలు లేవని, తమిళనాడు ప్రజలు అర్థం చేసుకోవాలని సీటీ రవి అన్నారు. పిల్లలు ఏడ్చినప్పుడే తల్లి పాలు ఇస్తుంది. అయితే అందుకు విరుద్దంగా తమిళనాడు అడగకముందే కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు నీళ్లు వదిలేశారని సీటీ రవి ఆరోపించారు.

BJP leader CT Ravi accuses Karnataka government of releasing Cauvery water for friendship with TN CM Stalin

స్టాలిన్ దోస్తీకి కర్ణాటకను సిద్దరామయ్య ప్రభుత్వం బలిపశువును చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. మండ్య ప్రజలకు శాపం ఇప్పుడు తమిళనాడుకు వరంగా మారిందని, మీ ప్రయోజనాల కోసం మీరు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని, అందుకే తమిళనాడుకు కావేరీ నీరు వదిలేస్తున్నారని మాజీ మంత్రి సీటీ రవి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+